ఉన్నది ఒకటే జిందగీ ప్రీ-రిలీజ్ ఫంక్షన్

Monday,October 23,2017 - 04:46 by Z_CLU

ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా నటించిన క్రేజీ ప్రాజెక్టు ఉన్నది ఒకటే జిందగీ. సాంగ్స్, ట్రయిలర్ తో ఇప్పటికే హల్ చల్ చేస్తున్న ఈ సినిమాకు సంబంధించి మరో సందడి షురూ కానుంది. ఈనెల 25న ఈ మూవీ ప్రీ-రిలీజ్ ఫంక్షన్ ను గ్రాండ్ గా సెలబ్రేట్ చేయబోతున్నారు. హైదరాబాద్ పార్క్ హయత్ లో ఉన్నది ఒకటే జిందగీ ప్రీ-రిలీజ్ ఫంక్షన్ జరగనుంది.

రామ్-కిషోర్ తిరుమల హిట్ కాంబినేషన్ లో ఎమోషనల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కింది ఉన్నది ఒకటే జిందగీ. ఇప్పటికే సెన్సార్ పూర్తిచేసుకున్న ఈ సినిమా, ఈ వీకెండ్ వరల్డ్ వైడ్ భారీ స్థాయిలో విడుదలకానుంది. వీళ్లిద్దరి కాంబోలో గతంలో వచ్చిన నేను శైలజ సినిమా బ్లాక్ బస్టర్ విజయం సాధించడంతో.. ఉన్నది ఒకటే జిందగీ ప్రీ-రిలీజ్ బిజినెస్ భారీగా జరిగింది.

‘స్రవంతి’ రవికిశోర్, పీఆర్‌ సినిమాస్‌ సమర్పణలో స్రవంతి సినిమాటిక్స్‌ పతాకంపై కృష్ణచైతన్య నిర్మించిన ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. ఎన్ని ఎత్తుపల్లాలు వచ్చినా జిందగీ మొత్తం మనతో ఉండేవాడే నిజమైన స్నేహితుడని నమ్మే రాక్ స్టార్ అభిరామ్ అనే పాత్ర చుట్టూ అల్లుకున్న కథతో రాబోతోంది ఉన్నది ఒకటే జిందగీ.