ఆక్సిజన్ కోసం స్పెషల్ స్టెప్పులు

Thursday,December 01,2016 - 01:10 by Z_CLU

గోపీచంద్ ఆక్సిజన్ కి ఇప్పుడు స్వాతి చౌదరి కూడా తోడైంది. యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా లో రాశిఖన్నా హీరోయిన్ గా నటిస్తుంది. దీనితో సిచ్యువేషనల్ గా ఉండే ఒక స్పెషల్ సాంగ్ లో సాక్షి చౌదరి స్టెప్పులు వేస్తుంది.

కమర్షియల్ సినిమా అంటేనే థ్రిల్లింగ్ ఫైట్స్, మెస్మరైజింగ్ రొమాన్స్, కావాల్సినంత కామెడీ తో పాటు స్పెషల్ సాంగ్ అనే ఎలిమెంట్ కూడా కంపల్సరీ అయిపోయింది. ఈ సాంగ్ లో తన గత సినిమాలతో పోలిస్తే, సరికొత్త లుక్ లో సాక్షిని ప్రెజెంట్ చేస్తునట్టు సమాచారం.

రామోజీ ఫిలిం సిటీలో భారీ దాబా సెట్ లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ పాట, సినిమాకి హైలెట్ గా నిలుస్తుందని కాన్ఫిడెంట్ గా ఉంది సినిమా యూనిట్. ఈ సినిమాలో జగపతి బాబు కూడా ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ లో నటిస్తున్నాడు.