అను ఇమ్మానుయేల్ ఇంటర్వ్యూ

Monday,October 30,2017 - 03:40 by Z_CLU

గోపీచంద్ హీరోగా A.M. జ్యోతికృష్ణ డైరెక్షన్ లో తెరకెక్కిన ‘ఆక్సిజన్’ నవంబర్ 10 న గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతుంది. ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన అనూ ఇమ్మాన్యువెల్ ఈ సినిమాలో తన క్యారెక్టర్ తో పాటు, తన నెక్స్ట్ సినిమా కబుర్లను షేర్ చేసుకుంది అవి మీకోసం….

 

ఇదే నా ఫస్ట్ సినిమా…

ఆక్సిజన్ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు మజ్ను సినిమాలో చాన్స్ వచ్చింది. డైరెక్టర్ గారు నా ఫోటో గూగుల్ లో చూసి ఈ సినిమాలో ఆఫర్ ఇచ్చారు. అప్పుడు నేను U.S.లో ఉన్నాను.

ఆక్సిజన్ లో నా క్యారెక్టర్

ఈ సినిమాలో నేను డాక్టర్ లా నటించాను. ఎప్పుడూ హీరోకి సర్ ప్రైజెస్ ఇస్తుంటాను…

ప్రస్తుతానికి అదే కరెక్ట్…

రీసెంట్ గా తమిళ సినిమా చేశాను కానీ ప్రస్తుతం నా ఫోకస్ మొత్తం తెలుగు సినిమా పైనే ఉంది. మళయాళ సినిమాతో నా కరియర్ బిగిన్ అయినా, తెలుగు ఇందాస్త్రీలోనే బావుంది. మంచి డైరెక్టర్స్ ఉన్నారు, స్టార్స్ ఉన్నారు, ప్రస్తుతం నా కంప్లీట్ కాన్సంట్రేషన్ టాలీవుడ్ పైనే ఉంది. తక్కిన లాంగ్వేజెస్ కూడా చేస్తాను కానీ కొంచెం టైమ్ తీసుకుంటాను.

ఆయనతో పని చేయడం బ్లెస్సింగ్..

పవన్ కళ్యాణ్ గారి పక్కన నిల్చోగలిగినా అదృష్టమే… అలాంటిది ఆయన సినిమాలో నటించే అవకాశం రావడం నిజంగా బ్లెస్సింగ్… చాలా ఫాస్ట్ గ అజరుగుతుంది షూటింగ్..  ఈ రోజు యూరోప్ కి వెళ్తున్నాను ఆ సినిమా కోసమే…

నా విషయంలో అంతా రివర్స్ జరిగింది…

సాధారణంగా అందరికీ చిన్న సినిమాల తరవాత స్టార్ సినిమాలో నటించే చాన్స్ వస్తుంది. నా విషయంలో మాత్రం అంతా రివర్స్ ఐంది. నా కరియర్ బిగినింగ్ లోనే పెద్ద స్టార్స్ తో పనిచేసే అవకాశాలు రావడం నిజంగా నా అదృష్టమే…

డైరెక్టర్ ని బట్టే గ్లామరస్ రోల్స్…

 నా దృష్టిలో గ్లామరస్ రోల్ అని పర్టికులర్ గా ఉండవు. గ్లామరస్ రోల్ చేయాలా వద్దా..? అని ఆప్షన్స్ పెట్టుకోవడం కన్నా, ఎలాంటి డైరెక్టర్ తో చేయాలి అనే ఆప్షన్స్ పెట్టుకోవడం బెటర్. ఒక నటిగా అన్ని రకాల క్యారెక్టర్స్ చేయాలి అని నేను అనుకుంటున్నాను…

బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరూ లేరు…

ఇండస్ట్రీలో నాకంటూ బెస్ట్ ఫ్రెండ్స్ అంటూ ఎవరూ లేరు కానీ, ఏ సినిమా చేసినా వాళ్ళతో నాకు మ్చ్న్హి రిలేషన్ షిప్, మజ్ను తరవాత నానితో, జ్యోతికృష్ణ తో అందరితో ఫ్రెండ్లీ గా ఉంటాను..

స్టడీస్ కంటిన్యూ చేయాలని ఉంది…

సైకాలజీలో వన్ ఇయర్ చదివాను. ఆ తరవాత సినిమాల వల్ల డిస కంటిన్యూ అవ్వాల్సి వచ్చింది. అవకాశం దొరికితే స్టడీస్ కంటిన్యూ చేయాలని ఉంది.

 

నేనైతే కాన్ఫిడెంట్ గా ఉన్నాను…

ఆక్సిజన్ నిజానికి చాలా టైమ్ తీసుకుని రిలీజ్ అవుతుంది. ఈ సినిమా సక్సెస్, హీరో గోపీచంద్ తో పాటు డైరెక్టర్ కి చాలా చాలా అవసరం. నాకైతే డెఫ్ఫినేట్ గా ఈ సినిమా అందరి కరియర్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకు వెళ్తుందనే నమ్మకం ఉంది.

ఆయన్ని చూడగానే అంతా మరిచిపోతాను

పవన్ కళ్యాణ్ గారు సెట్స్ లో చాలా కూల్ గా, జోవియల్ గా ఉంటారు, జోక్స్ కూడా వేస్తుంటారు. ఆయనతో పని చేసేటప్పుడు ప్రతిసారి డైలాగ్ ని నాలుగైదుసార్లు చూసుకుంటాను, అయినా ఆయన ఎదురుగా వెళ్ళగానే మర్చిపోతుంటాను.