మహేష్ మూవీకి 125 కోట్ల ఆఫర్

Thursday,December 01,2016 - 03:16 by Z_CLU

మురుగదాస్ దర్శకత్వంలో మహేష్ చేస్తున్న సినిమాకు ఇంకా పేరు పెట్టలేదు. కానీ ఆడియన్స్ లో మాత్రం ఈ సినిమాపై ఉన్న క్రేజ్ అంతాఇంతా కాదు. ఆ క్రేజ్ కు తగ్గట్టే ఇప్పుడు మహేష్ మూవీ బిజినెస్ తో హల్ చల్ చేస్తోంది. ప్రీ-రిలీజ్ బిజినెస్ లో మహేష్ మూవీ సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది.

తాజా సమాచారం ప్రకారం… మహేష్ కొత్త సినిమాకు 125 కోట్ల రూపాయల ఫ్యాన్సీ ఆఫర్ వచ్చినట్టు తెలుస్తోంది. తెలుగు-తమిళ భాషల్లో సైమల్టేనియస్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ కోసం ఓ బడా డిస్ట్రిబ్యూషన్ కంపెనీ… ఏకంగా 125 కోట్ల రూపాయలు ఆఫర్ చేసినట్టు టాక్ నడుస్తోంది. అయితే ఈ మొత్తానికి థియేట్రికల్ రైట్స్ ను అప్పగించేందుకు నిర్మాతలు ఏమాత్రం ఇంట్రెస్ట్ చూపించలేదట.

mahesh-new-movie-2

ఎందుకంటే… ఈ సినిమా కేవలం తెలుగులో మాత్రమే విడుదలకావడం లేదు. సైమల్టేనియస్ గా తమిళ్ లో కూడా రిలీజ్ చేస్తున్నారు. పైగా దర్శకుడు మురుగదాస్ కు కోలీవుడ్ లో మంచి మార్కెట్ ఉంది కాబట్టి,   తమిళ్ లో కూడా మహేష్ మూవీకి డీసెంట్ వసూళ్లు వస్తాయని ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు. అందుకే అంత పెద్ద బిగ్ డీల్ ను కూడా నిర్మాతలు రిజెక్ట్ చేశారని టాక్. ఈ టాక్ సంగతి పక్కనపెడితే… మహేష్-మురుగ కాంబోలో వస్తున్న కొత్త సినిమా మాత్రం సంచలనాలు సృష్టించడం గ్యారెంటీ అనే బజ్ మాత్రం బ్రహ్మాండంగా నడుస్తోంది.