నాని కన్ఫర్మ్ మరో హీరో ఎవరు ?

Sunday,January 20,2019 - 03:49 by Z_CLU

దిల్ రాజు నిర్మాణంలో  ఓ మల్టీ స్టారర్ సినిమా తెరకెక్కించబోతున్నాడు ఇంద్రగంటి మోహన కృష్ణ. ఇటివలే అనౌన్స్ చేసిన ఈ సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. అయితే ఈ సినిమాలో ఒక హీరోగా నాని ని కన్ఫర్మ్ చేసుకున్నారట మేకర్స్. త్వరలోనే మరో హీరో ని కూడా ఫైనల్ చేసుకొని అఫీషియల్ గా అనౌన్స్ చేయబోతున్నారని తెలుస్తోంది.  ఈ సినిమా ఇంద్రగంటి స్టైల్ లో ఫన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనుందని సమాచారం.

లేటెస్ట్ గా వెంకటేష్ వరుణ్ తేజ్ కాంబినేషన్ లో ‘F2’ సినిమాను నిర్మించి గ్రాండ్ హిట్ అందుకున్న దిల్ రాజు ఈ సారి ఎలాంటి కాంబో ని సెట్ చేస్తాడో..చూడాలి.