మెగా లాంచ్.. అంతా రెడీ

Sunday,January 20,2019 - 02:02 by Z_CLU

మెగా ఫ్యామిలీ నుండి మరో హీరో పరిచయం కాబోతున్న సంగతి తెలిసిందే. సాయి ధరం తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా తెరకెక్కనున్న సినిమా రేపే గ్రాండ్ గా లాంచ్ కానుంది.  రామానాయుడు స్టూడియోస్ లో జరగనున్న ఈ లాంచింగ్ కి మెగా స్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. అలాగే మెగా హీరోలు కూడా పాల్గొని వైష్ణవ్ కి ఆల్ ది బెస్ట్ చెప్పనున్నారు.

మైత్రి మూవీ మేకర్స్ , సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ పై తెరకెక్కనున్న ఈ సినిమాతో బుచ్చి బాబు సాన దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఫిబ్రవరి నుండి సెట్స్ పైకి రానున్న ఈ సినిమాలో వైష్ణవ్ తేజ్ సరసన ఓ కొత్త అమ్మాయి హీరోయిన్ గా నటించనుంది.