"ఎన్టీఆర్" నుంచి మరో పాట

Monday,December 10,2018 - 03:30 by Z_CLU

ఎన్టీఆర్ బయోపిక్ కు సంబంధించి ఇప్పటికే ఓ సాంగ్ రిలీజైంది. పూర్తిగా క్లిష్టమైన పదాలతో ఉన్న ఆ పాట వినడానికి చాలా బాగుంది. కీరవాణి కంపోజ్ చేసిన ఆ సాంగ్ దాదాపు 30 గంటల పాటు ట్రెండింగ్ లో నడిచింది. ఇప్పుడు ఎన్టీఆర్ బయోపిక్ నుంచి మరో పాట రెడీ అయింది.

రాజశ్రీ అనే లిరిక్స్ తో సాగే ఈ పాటను 12వ తేదీ ఉదయం 10గంటల 31 నిమిషాలకు విడుదల చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు ఎన్టీఆర్ బయోపిక్ నుంచి మరో బ్రాండ్ న్యూ పోస్టర్ కూడా విడుదల చేశారు. నిజానికి ఈ సింగిల్ ను ఈరోజే విడుదల చేయాలనేది ప్లాన్. కానీ ఎల్లుండికి వాయిదాపడింది.

రాజకీయ పార్టీ స్థాపించాలని ఎన్టీఆర్ నిర్ణయించుకున్న క్షణంలో వచ్చే మాంటేజ్ సాంగ్ ఇది. పార్టీ పేరు, గుర్తు, ఎజెండా, జెండా లాంటి అంశాలపై క్లారిటీ ఇచ్చేలా ఈ పాటను తీర్చిదిద్దారు.

ఈనెల 16న ఎన్టీఆర్ బయోపిక్ ఆడియో లాంఛ్ ను తిరుపతిలో గ్రాండ్ గా సెలబ్రేట్ చేయాలని నిర్ణయించారు. ఇక బయోపిక్ లో ఫస్ట్ పార్ట్ ను సంక్రాంతి కానుకగా జనవరి 9న రిలీజ్ చేస్తారు.