నితిన్ రుణం తీర్చుకోలేనిది – మేఘా ఆకాష్

Wednesday,March 28,2018 - 10:03 by Z_CLU

 ఏప్రిల్ 5 న గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతుంది నితిన్ ‘ఛల్ మోహన రంగ’ సినిమా. రీసెంట్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుపుకున్న ఈ సినిమా  రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న కొద్దీ ఇంట్రెస్టింగ్ బజ్ క్రియేట్ చేస్తుంది. ఈ సినిమాలో నితిన్ సరసన నటించిన మేఘా ఆకాష్ ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సినిమా యూనిట్ గురించి, కంప్లీట్ సినిమా మేకింగ్ ప్రాసెస్ లో టీమ్ చేసిన సపోర్ట్ గురించి స్పెషల్ గా చెప్పుకుంది.

“ఈ సినిమా గురించి మాట్లాడటం కన్నా, నాకీ సినిమాలో నటించే అవకాశం ఇచ్చిన ఫిల్మ్ మేకర్స్ కి థాంక్స్ చెప్పుకోవాలి. వారి ఋణం తీర్చుకోలేనిది. ఈ సినిమా యూనిట్ తో ఫ్యామిలీ లా కలిసిపోయాను. డైరెక్టర్ కృష్ణ చైతన్య గారి దగ్గరి నుండి చాలా నేర్చుకున్నాను. హీరో నితిన్ సపోర్ట్ కి చాలా పెద్ద థాంక్స్” అని చెప్పుకుంది మేఘా ఆకాష్.

అల్టిమేట్ లవ్ ఎంటర్ టైనర్ లా తెరకెక్కిన ఈ సినిమాలో నితిన్, మేఘా ఆకాష్ ల కెమిస్ట్రీ హైలెట్ కానుంది. కృష్ణ చైతన్య డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాని  పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్, M. సుధాకర్ రెడ్డి సంయుక్తంగా  నిర్మిస్తున్నారు.