Raja Raja Chora - ఈ సినిమాలో అందరూ హీరోలే

Saturday,August 28,2021 - 05:04 by Z_CLU

సెకెండ్ వేవ్ తర్వాత సూపర్ హిట్టయిన సినిమా రాజరాజ చోర. ఇంకా చెప్పాలంటే ఈ సినిమా డబుల్ బ్లాక్ బస్టర్. పెట్టిన పెట్టుబడికి రెట్టింపు లాభాలు అందుకుంటోంది. ఇప్పటికీ సక్సెస్ ఫుల్ గా థియేటర్లలో నడుస్తోంది. అందుకే మేకర్స్ మరోసారి ఆ సక్సెస్ ను సెలబ్రేట్ చేసుకున్నారు. అందరికీ థ్యాంక్స్ చెప్పారు. ఈ సందర్భంగా మాట్లాడిన శ్రీవిష్ణు.. రాజ రాజ చోర సినిమాలో అసలైన హీరో తను కాదని అంటున్నాడు.

Raja Raja Chora

 సినిమా అనుకున్న‌ప్పుడు కుమార్ చౌద‌రిగారి ద‌గ్గ‌ర‌కు వెళ్లాం. అలా పీపుల్ ఫ్యాక్ట‌రీకి వెళ్లి వివేక్‌గారిని క‌లిశాం. త‌ర్వాత అభిషేక్ అగ‌ర్వాల్‌గారిని క‌లిశాం. వ‌ర్క్ స్టార్ట్ అయిన త‌ర్వాత టీమ్‌కు చాలా ఫ్రీడ‌మ్ ఇచ్చి వ‌ర్క్ చేయించుకున్నారు. ఇలాంటి టీమ్‌తో క‌లిసి ప‌నిచేయ‌డం నిజంగా అదృష్టం. రెండుసార్లు పాండ‌మిక్ వ‌చ్చిన‌ప్పుడు నిర్మాత‌లు ఎంతో సపోర్ట్ అందించారు.

  టీమ్‌లో అంద‌రూ త‌మ సినిమా అనుకుని ఎంతో క‌ష్ట‌ప‌డ్డారు. వేద సినిమాకు ఏది బెస్ట్ అవుతుంద‌ని అనుకున్నాడో దాన్ని ఇచ్చాడు. సినిమా చేసే స‌మ‌యంలోనే డిఓపికి మంచి పేరు వ‌స్తుంద‌ని అనుకున్నాం. మేం అనుకున్న‌ది నిజ‌మైంది. అలాగే విప్ల‌వ్ కూడా ఎక్స్‌ట్రార్డిన‌రీ ఔట్‌పుట్ ఇచ్చాడు.

Raja Raja Chora

 మ్యూజిక్ డైరెక్ట‌ర్ వివేక్ సాగ‌ర్‌ను ఎప్పుడు క‌లిసినా, సినిమా గురించి మాట్లాడిన‌ప్పుడు త‌న‌కు ఏం ఇవ్వాలో తెలుసు. దాన్ని హండ్రెడ్ ప‌ర్సెంట్ ఇచ్చేస్తాడు. ఇలా రాజ‌రాజ‌చోర స‌క్సెస్‌లో భాగ‌మైన టెక్నీషియ‌న్స్‌కు థాంక్స్.

  ఇక న‌టీన‌టుల విష‌యానికి వ‌స్తే హీరోయిన్స్ సునైన‌, మేఘా ఆకాశ్ సినిమాను ఎంత వ‌ర‌కు న‌మ్మారో తెలియ‌దు. కానీ.. నేను, హ‌సిత్ అయితే హీరోయిన్స్‌కు చాలా మంచి పేరు వ‌స్తుంద‌ని అనుకున్నాం. ఇద్ద‌రు చాలా బాగా చేశారు. సినిమా సూప‌ర్ హిట్ వ‌చ్చింది. అందుకు హీరోయిన్స్‌కు థాంక్స్‌.

Raja Raja Chora

 ర‌విబాబు గారు, భ‌ర‌ణిగారు, కాదంబ‌రి కిర‌ణ్‌ గారు, శ్రీకాంత్ అయ్య‌ర్‌గారు ఇలా అంద‌రూ చ‌క్క‌టి స‌పోర్ట్ ఇచ్చారు. ర‌విబాబుగారు ఈ సినిమాకు హీరో అనాలి. హీరోయిన్స్‌, ర‌విబాబుగారు, గంగ‌వ్వ, శ్రీకాంత్ అయ్య‌ర్‌గారు ఏం చేశారో దానికి నేను రియాక్ట్ అయ్యానంతే. నేను చేసిందేమీ లేదు. వాళ్ల‌ని హీరోలుగా ఫీలయ్యే ఈ సినిమా మేం చేశాం. ఎందుకంటే పాత్ర‌లు అలాంటివి మ‌రి.

⇒ సాధార‌ణంగా ఓ సినిమాలో రెండు, మూడు పాత్ర‌లు బావుంటాయి. కానీ.. సినిమాలో చేసిన ప్ర‌తి పాత్ర అదిరిపోయింది. అలాంటి పాత్ర‌ల‌ను క్రియేట్ చేసిన ద‌ర్శ‌కుడు హ‌సిత్ గ్రేట్‌. ఈ క‌థ ఇంత బాగా రావ‌డానికి వివేక్ ఆత్రేయ ఓ మెంట‌ర్‌లాగా ఉండి న‌డిపించాడు. క‌రోనా టైమ్‌లో త‌ను చేస్తున్న సినిమాల‌కు సంబంధించిన క‌థ‌లు రాసుకుంటూ, మాకు ఫోన్ చేసి మా క‌థ గురించి డిస్క‌స్ చేస్తూ మాకెంతో స‌పోర్ట్‌గా నిలిచాడు. త‌న‌కు స్పెష‌ల్ థాంక్స్‌.

Raja Raja Chora

 సినిమా చేసిన త‌ర్వాత రిలీజ్ అని ఓ వారం ముందు మాత్ర‌మే అనుకున్నాం. అయితే మీడియా ఎంత‌గానో సినిమాను ప్రేక్ష‌కుల ముందుకు తీసుకెళ్లాడు. చాలా రోజులు ఈ సినిమా ప్రేక్ష‌కుల మ‌న‌సుల్లో నిలిచిపోయే చిత్ర‌మిది. ఇంకా మంచి సినిమాలు చేస్తాను. ప్రేక్ష‌కుల ఆశీస్సులు ఇలాగే ఉండాల‌ని కోరుకుంటున్నాను.

  • – Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics