BUNNY -Trvikram పెద్ద ఛాలెంజే

Saturday,January 23,2021 - 09:35 by Z_CLU

సహజంగా ఓ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాక ఆ హీరో , దర్శకుడు చేసే తదుపరి సినిమాలపై భారీ అంచనాలు ఉంటాయి. అలాంటిది ఇండస్ట్రీ హిట్ కొడితే ఆ అంచనాలు తారా స్థాయికి చేరుకుంటాయి. సరిగ్గా ఇప్పుడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ , మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ నెక్స్ట్ సినిమాలపై అలాంటి అంచనాలే నెలకొంటున్నాయి. ఇద్దరు కలిసి ‘అల వైకుంఠపురములో’ తో భారీ వసూళ్ళు రాబట్టి టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర ఇండస్ట్రీ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. దీంతో ఇప్పుడు విడివిడిగా చేస్తున్న ఈ ఇద్దరి సినిమాల మీద ప్రీవియస్ గ్రాండ్ హిట్ సినిమా ప్రభావం గట్టిగా ఉంది.

‘అల వైకుంఠపురములో’ తర్వాత అల్లు అర్జున్ సుకుమార్ డైరెక్షన్ లో ‘Pushpa’ సినిమా చేస్తుండగా త్రివిక్రమ్ ఎన్టీఆర్ తో #NTR30 సినిమా చేయబోతున్నాడు. ఈ రెండు సినిమాలపై అల ప్రభావం చాలా వరకు పడనుంది.

బిజినెస్ పరంగానూ రెండు సినిమాలకు పెద్ద ప్లస్ అవ్వనుంది. మరి ఈ ప్రభావంతో బన్నీ , త్రివిక్రమ్ విరివిరిగా ఎలాంటి విజయం అందుకుంటారో ? అనేది ఆసక్తికరంగా మారింది.