'క్రాక్' డైరెక్టర్ తో సీనియర్ హీరో సినిమా ?

Saturday,January 23,2021 - 09:32 by Z_CLU

రవితేజతో తెరకెక్కించిన ‘క్రాక్’ సినిమాతో సంక్రాంతి బరిలో బ్లాక్ బస్టర్ అందుకొని ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యాడు గోపీచంద్ మలినేని. ప్రస్తుతం గోపీచంద్ కి ఇండస్ట్రీ నుండి చాలా ఆఫర్స్ వస్తున్నాయి. ‘క్రాక్’ షూటింగ్ టైంలోనే మలినేని అదే రేంజ్ యాక్షన్ ఎపిసోడ్స్ తో మరో మాస్ యాక్షన్ డ్రామా కథను సిద్దం చేసుకున్నాడు. ఇప్పుడీ కథతో బాలయ్య ను డైరెక్ట్ చేస్తాడని సమాచారం.

క్రాక్ రిలీజ్ కి ముందే గోపీచంద్ బాలకృష్ణ ను కలిసి స్క్రిప్ట్ వినిపించాడని తనకి బాగా సూటయ్యే కథ అనిపించడంతో బాలయ్య వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తుంది. ప్రస్తుతం డిస్కషన్ స్టేజిలో ఉన్న ఈ ప్రాజెక్ట్ త్వరలోనే ఎనౌన్స్ అవ్వనుందని అంటున్నారు. ఈ కాంబినేషన్ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మించనుందని టాక్. మరి క్రాక్ తో దర్శకుడిగా ట్రాక్ ఎక్కిన గోపీచంద్ మలినేని బాలయ్య ను ఎలా ప్రెజెంట్ చేస్తాడో చూడాలి.