హృతిక్ వచ్చేది అప్పుడే..

Wednesday,October 12,2016 - 05:27 by Z_CLU

బాలీవుడ్ సూపర్ స్టార్ హృతిక్ రోషన్, రాకేష్ రోషన్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్టైనర్  “కాబిల్” . గతంలో క్రిష్, క్రిష్ 3, కోయి మిల్ గయా, కహో నా ప్యార్ హై వంటి సూపర్ హిట్ చిత్రాలతో అలరించి విజయాలు అందుకున్న ఈ కాంబినేషన్ లో రానున్న కాబిల్ పై బాలీవుడ్ లో భారీ అంచనాలే ఉన్నాయి. హృతిక్ రోషన్ సరసన యామీ గౌతమ్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రాన్ని తెలుగులో కూడా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

          జనవరి 26 న హిందీతో పాటు తెలుగులో ఒకేసారి ఈ సినిమా గ్రాండ్ గా విడుదలకానంది. గతంలో హృతిక్ నటించిన క్రిష్ సీక్వెల్స్ , ధూమ్ 2 చిత్రం తెలుగులో విశేష ఆదరణ పొందిన సంగతి తెలిసిందే. హృతిక్ కి తెలుగు రాష్ట్రాల్లో మంచి ఫాలోయింగ్ ఉండటంతో, తెలుగులో కూడా భారీ గా విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇక ఈ చిత్ర టీజర్ దీపావళి కానుకగా నవంబర్ 26న విడుదల కానుంది.