నిఖితకు పెళ్లయిపోయింది

Wednesday,October 12,2016 - 05:21 by Z_CLU

తెలుగులో హాయ్ సినిమాతో తెరంగేట్రం చేసిన నిఖిత పెళ్లి చేసుకుంది. ముంబైలో ఉండే మాజీ కాంగ్రెస్ యూత్ ప్రెసిడెంట్, ఇండస్ట్రియలిస్ట్ గగన్ దీప్ సింగ్ మాగో ని అక్టోబర్ 10 న పెళ్ళాడింది. హాయ్ తరవాత కళ్యాణ రాముడు, సంబరం లాంటి సినిమాల్లో నటించిన నిఖిత టాలీవుడ్ లో ఓ మోస్తరుగా గుర్తింపు తెచ్చుకుంది.

తెలుగు తో పాటు తమిళ, మళయాళ, కన్నడ భాషల్లోనూ నటించిన నిఖిత… రీసెంట్ గా ‘ట్రాఫిక్’ హిందీ వర్షన్ లోను నటించింది. చాలా రోజులుగా గగన్ దీప్ తో రిలేషన్ షిప్ లో ఉన్నట్టు తెలిపిన నికిత… ఎట్టకేలకు రెండు కుటుంబాల నుండి గ్రీన్ సిగ్నల్ వచ్చిందని, అందుకే ఇలా పెళ్లితో ఒకటయ్యామని తెలిపింది. తన పెళ్లి సంబరానికి సంబంధించిన ఫొటోల్ని కూడా ఆమె షేర్ చేసింది.