వంగవీటి హంగామా

Wednesday,October 12,2016 - 06:11 by Z_CLU

దసరా సందర్భంగా అంతా శాతకర్ణి, ధృవ టీజర్ల గురించే మాట్లాడుకున్నారు. కానీ అదే సమయంలో వచ్చిన వంగవీటి సినిమా విజువల్ కూడా అదే స్థాయిలో ఎట్రాక్ట్ చేసింది. నిజానికి బాలయ్య, రామ్ చరణ్ సినిమాలకు సంబంధించి కేవలం టీజర్లు మాత్రమే విడుదలయ్యాయి. కానీ రామ్ గోపాల్ వర్మ మాత్రం ఏకంగా తన కొత్త సినిమాకు సంబంధించి కీలకమైన క్లిప్పింగులే విడుదల చేశాడు. మోస్ట్ కాంట్రవర్సియల్ సబ్జెక్ట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాను, అదే చాకచక్యంతో ప్రజెంట్ చేశాడు వర్మ. సినిమా విడుదలైన తర్వాత ఎలాంటి ఇబ్బందులు ఉండవని హామీ ఇస్తున్నాడు.

వర్మ రూపొందించిన ‘వంగవీటి’ సినిమా డిసెంబర్ 23న థియేటర్లలో విడుదల కానుంది. అద్భుతమైన బ్యాగ్రౌడ్ స్కోర్ తో.. ‘చంపరా.. చంపెయ్యరా..’ అంటూ దడపుట్టేంచే వంగవీటి షాట్లను వీడియోలో చూడోచ్చు.  వర్మ అక్టోబర్ 2న ‘వంగవీటి’ ట్రైలర్ విడుదల చేశారు. యూ ట్యూబ్ లో ఇప్పటివరకు 15.5 లక్షల మంది దానిని చూశారు. ఇక వంగవీటి షాట్లు నెటిజన్లను ఏమేరకు ఆకట్టుకుంటాయో చూడాలి.