కాటమరాయుడి కోసం...

Monday,October 24,2016 - 01:10 by Z_CLU

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ బుల్లెట్ పై వస్తుంటే అభిమానులకు చూడ్డానికి రెండు కళ్లు సరిపోవు. గబ్బర్ సింగ్ లో బుల్లెట్ పై పవన్ ఎప్పీయరెన్స్ ను ఇప్పటికే చూశాం. అంతకంటే ముందు తీన్ మార్ లో కూడా పవన్ బుల్లెట్ పై కనిపించాడు. తాజాగా సర్దార్ గబ్బర్ సింగ్ లో కూడా మన బుల్లెట్ రాజా హల్ చల్ చేశాడు. ఇప్పుడు సెట్స్ పై ఉన్న కాటమరాయుడు సినిమా కోసం కూడా పవన్ సేమ్ ట్రెండ్ ఫాలో అవుతున్నాడు.

collage123

ఫ్యాక్షనిజం బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న కాటమరాయుడు సినిమాలో కూడా బుల్లెట్ యూజ్ చేయబోతున్నాడు పవన్. ఈ మేరకు పవన్ ఉపయోగించనున్న బుల్లెట్ ను ప్రత్యేకంగా రెడీ చేశారు. తన ప్రతి సినిమాలో బుల్లెట్ ను డిఫరెంట్ గా డిజైన్ చేయించుకునే పవన్… కాటమరాయుడు కోసం కూడా అలాంటిదే మరో స్పెషల్లీ డిజైన్డ్ బుల్లెట్ ను తయారుచేయించుకున్నాడట. వచ్చే వారం నుంచి పవన్ బుల్లెట్ నడిపే సన్నివేశాలను షూట్ చేయబోతున్నారు.