హోమ్ వర్క్ బిగిన్ అయింది

Wednesday,April 26,2017 - 11:26 by Z_CLU

సూపర్ స్టార్ రజినీకాంత్ 2.0 ఇంకా సెట్స్ పైనే ఉంది. ఈ లోపు పా.రంజిత్ డైరెక్షన్ లో తెరకెక్కనున్న రజినీకాంత్ నెక్స్ట్ సినిమాకి ప్రీ ప్రొడక్షన్ తో పాటు రిహార్సల్స్ కూడా బిగిన్ అయిపోయాయి. హీరో ధనుష్ నిర్మిస్తున్న ఈ సినిమాలో రజినీకాంత్ అండర్ వరల్డ్ డాన్ లా కనిపించనున్నాడు. 2.0 తో 160 సినిమాలను పూర్తి చేసుకోనున్న రజినీకాంత్ కరియర్ లో ఇది 161 వ సినిమా.

ఈ సినిమాకి సంబంధించి ఇంకా అఫీషియల్ కన్ఫర్మేషన్ అయితే రాలేదు కానీ, మే 1 న ఈ సినిమాని లాంచ్ చేసే ఆలోచనలో సినిమా యూనిట్ ఉన్నట్టు తెలుస్తుంది. రజినీకాంత్ 2.0 కి ప్యాకప్ చెప్పేలోపు రెడీ టు షూట్ మోడ్ లో ఉండాలనే ఆలోచనలో ఉన్న పా. రంజిత్ టీమ్, కబాలి సినిమా లాగే ఈ సినిమా కోసం ఆల్ రెడీ హోమ్ వర్క్ బిగిన్ చేసేసింది. ఈ సినిమాకి సంబంధించి తక్కిన కాస్ట్ డీటేల్స్ ఇంకా తెలియాల్సి ఉంది.