Solo Brathuke Song - మేజిక్ రిపీట్స్

Thursday,August 27,2020 - 07:42 by Z_CLU

ఓవైపు తమన్.. మరోవైపు సిద్ శ్రీరామ్..
వీళ్లిద్దరూ కలిస్తే ఏమౌతుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అల వైకుంఠపురములో సినిమాలో సామజవరగమన సాంగ్ తో వీళ్లు క్రియేట్ చేసిన రికార్డ్ అందరికీ తెలిసిందే. ఇప్పుడీ కాంబినేషన్ మరోసారి వర్కవుట్ అయింది. ఈసారి సోలో బ్రతుకే సో బెటర్ సినిమా దీనికి వేదికగా నిలిచింది.

Solo Brathuke So Better మూవీ కోసం సిద్ శ్రీరామ్ తో ఓ సాంగ్ పాడించాడు తమన్ (Thaman). ఆ పాట ఇలా రిలీజై అలా హిట్టయింది. తమన్ మ్యూజిక్ కు సిద్ శ్రీరామ్ వాయిస్ యాడ్ అవ్వడంతో యూత్ ఈ సాంగ్ కు ఈజీగా కనెక్ట్ అయింది.

Hey Idi Nenena అనే లిరిక్స్ తో సాగే ఈ సాంగ్ ప్రస్తుతం 2 మిలియన్ వ్యూస్ తో దూసుకుపోతోంది. రాబోయే రోజుల్లో ఇది ఇంకెన్ని రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.