జీ సినిమాలు - ఆగస్ట్ 28

Thursday,August 27,2020 - 11:09 by Z_CLU

ఒక ఊరిలో
నటీనటులు : తరుణ్, రాజా, సలోని
ఇతర నటీనటులు : చంద్ర మోహన్, నరేష్, కల్పన, రామరాజు, యమునా, నిరోషా
మ్యూజిక్ డైరెక్టర్ : దేవి శ్రీ ప్రసాద్
డైరెక్టర్ : రమేష్ వర్మ
ప్రొడ్యూసర్ : చంటి అడ్డాల
రిలీజ్ డేట్ : 1 జూలై 2005
లవర్ బాయ్ తరుణ్, తెలుగమ్మాయి సలోని జంటగా నటించిన లవ్ ఎంటర్ టైనర్ ఒక ఊరిలో. ఒక అందమైన ఊరిలో మొదలైన ప్రేమకథ ఏ మలుపు తిరిగింది. చివరికి ఏమైంది అనే కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా మంచి ఫీల్ గుడ్ సినిమా అనిపించుకుంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం ఈ సినిమాకి హైలెట్.

-=================================

వసంతం
నటీనటులు : వెంకటేష్, ఆర్తి అగర్వాల్, కళ్యాణి
ఇతర నటీనటులు : V.V.S. లక్ష్మణ్, ఆకాష్, సునీల్, చంద్ర మోహన్, తనికెళ్ళ భరణి, ధర్మవరపు సుబ్రహ్మణ్యం మరియు తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : S.A. రాజ్ కుమార్
డైరెక్టర్ : విక్రమన్
ప్రొడ్యూసర్ : N.V. ప్రసాద్
రిలీజ్ డేట్ : 11 జూలై 2003
స్నేహానికి, ప్రేమకు మధ్య డిఫెరెన్స్ ని అద్భుతంగా ఎలివేట్ చేసిన ఫ్యామిలీ ఎంటర్ టైనర్ వసంతం. ఎంత పెద్ద త్యాగానికైనా వెనకాడని ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ కథే ఈ సినిమా. ఇమోషనల్ సీన్స్ సినిమాకి హైలెట్ గా నిలుస్తాయి.

===============================

చూడాలని ఉంది
నటీనటులు : చిరంజీవి, సౌందర్య, అంజలా జవేరి
ఇతర నటీనటులు : ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం, ధూళిపాళ్ళ, బ్రహ్మాజీ, వేణు మాధవ్, ఆహుతి ప్రసాద్ తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : మణిశర్మ
డైరెక్టర్ : గుణశేఖర్
ప్రొడ్యూసర్ : అశ్విని దత్
రిలీజ్ డేట్ : 27 ఆగష్టు 1998
తన కూతురు ప్రియ, తనకిష్టం లేకుండా రామకృష్ణని పెళ్ళి చేసుకుందన్న కోపంతో తనపై ఎటాక్ చేయిస్తాడు మహేంద్ర. అయితే ఓ సందర్భంలో రామకృష్ణకి బులెట్ తగిలే సమయానికి ప్రియ అడ్డు పడుతుంది. దాంతో ప్రియ చనిపోతుంది. ఇదే సమయంలో రామకష్ణ, ప్రియ ల కొడుకును మహేంద్ర తీసుకెళ్ళిపోతాడు. దానికి తోడు ప్రియని చంపింది రామకృష్ణే అని హత్యానేరం మోపుతాడు. దాంతో జైలుకు వెళ్ళిన రామకృష్ణ మహేంద్ర దగ్గర ఉన్న తన కొడుకు కోసం తిరిగి వస్తాడు. అప్పుడే తనకు పద్మావతితో పరిచయమవుతుంది. చివరికి రామకృష్ణ, మహేంద్రకి ఎదురు నిలిచి కొడుకును ఎలా దక్కించు కున్నాడనేదే అసలు కథ.

===================================

దువ్వాడ జగన్నాధమ్
నటీనటులు : అల్లు అర్జున్, పూజా హెగ్డే
ఇతర నటీనటులు : చంద్ర మోహన్, రావు రమేష్, మురళి శర్మ, సుబ్బరాజు, పోసాని కృష్ణ మురళి, తనికెళ్ళ భరణి, వెన్నెల కిషోర్ తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : దేవి శ్రీ ప్రసాద్
డైరెక్టర్ : హరీష్ శంకర్
ప్రొడ్యూసర్ : దిల్ రాజు
రిలీజ్ డేట్ : 23 జూన్ 2017
విజయవాడలో సత్యనారాయణపురం అగ్రహారం అనే ఊళ్ళో బ్రాహ్మణ కుర్రాడిగా కుటుంబంతో కలిసి పెళ్లిళ్లకు వంటచేసే దువ్వాడ జగన్నాథం(అల్లు అర్జున్) చిన్నతనంలో తనకు ఎదురైన కొన్ని సంఘటనల వల్ల సమాజంలో అన్యాయాలు జరగకుండా ఓ మార్పు తీసుకురావాలనుకుంటాడు. ఇందుకోసం ఓ పోలీస్ అధికారి పురుషోత్తం(మురళి శర్మ) సహాయం అందుకున్న దువ్వాడ సమాజంలో ప్రజలకి అన్యాయం చేసే వారిని ఎలా ఏ విధంగా ఎదుర్కున్నాడు.. చివరికి పెద్ద రియల్టర్ గా పేరొంది ప్రజల నుంచి డబ్బు దండుకున్న రొయ్యల నాయుడును ఏ విధంగా ఎదిరించి అంతమొందిచాడు.. అనేది సినిమా కథాంశం.

==================================

టాక్సీవాలా
నటీనటులు : విజయ్ దేవరకొండ, ప్రియాంక జవాల్కర్
ఇతర నటీనటులు : మాళవిక నాయర్, మధునందన్, కళ్యాణి, విష్ణు, రవి వర్మ, శిజు తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : జేక్స్ బిజాయ్
డైరెక్టర్ : రాహుల్ సంక్రిత్యాన్
ప్రొడ్యూసర్ : SKN, బన్ని వాస్
రిలీజ్ డేట్ : 17 నవంబర్ 2018
అతి కష్టం మీద ఐదేళ్లు చదివి డిగ్రీ పూర్తిచేసిన శివ (విజయ్‌ దేవరకొండ), అన్నయ్య(రవి ప్రకాష్) వదిన(కళ్యాణి)లకు భారం కాకూడదని హైదరాబాద్‌లో ఉన్న ఫ్రెండ్‌(మధు నందన్‌) దగ్గరకు ఉద్యోగం కోసం వస్తాడు. అలా ఉద్యోగం కోసం హైదరాబాద్ వచ్చిన శివ 2-3 ఉద్యోగాలు చేసి వర్కౌట్ కాకపోవడంతో చివరికి ఓ టాక్సీవాలా గా సెట్ అవ్వాలనుకుంటాడు.
కారు కొనడానికి డబ్బు లేకపోవడంతో తన బంగారం అమ్మి శివ కి డబ్బులు ఇస్తుంది వదిన. అలా వదిన ఇచ్చిన డబ్బుతో కారు కొనేందుకు వెతుకుతున్న క్రమంలో రఘు రామ్(సిజ్జు) దగ్గర ఓ పాత కాంటెస్సా
ఉందని తెలుసుకొని ఆ కారుని కొంటాడు శివ. అలా క్యాబ్‌ డ్రైవర్‌గా కెరీర్ మొదలుపెట్టిన శివ ఫస్ట్ డ్రైవ్ లో పరిచయం అయిన అనూష(ప్రియాంక జవాల్కర్) అనే అమ్మాయితో ప్రేమలో పడతాడు.
అంతా హ్యాపీగా సాగుతుందనుకున్న సమయంలో శివకి తను నడుపుతున్న కారులో దెయ్యం ఉందని తెలుస్తుంది. టాక్సీలో నిజంగానే దెయ్యం ఉందా..? ఇంతకీ టాక్సీలో ఉన్న ఆ పవర్‌ ఏంటి..? ఈ కథకి శిశిర (మాళవిక నాయర్‌) అనే అమ్మాయికు సంబంధం ఏంటి..? అనేది ‘టాక్సీవాలా’ కథ.