గుణ 369 ట్రయిలర్: లవ్ & యాక్షన్ సబ్జెక్ట్

Wednesday,July 17,2019 - 12:45 by Z_CLU

ఆర్ఎక్స్100తో సెన్సేషన్ క్రియేట్ చేసిన హీరో కార్తికేయ.. తన రెండో సినిమా కోసం పూర్తిగా లవ్ సబ్జెక్ట్ సెలక్ట్ చేసుకొని బోల్తా కొట్టాడు. మూడో సినిమాకు మాత్రం చాలా కేర్ తీసుకున్నాడు. గుణ369 ట్రయిలర్ చూస్తే ఆ విషయం అర్థమైపోతుంది. కొద్దిసేపటి కిందట విడుదలైన ఈ ట్రయిలర్ లో లవ్, యాక్షన్ ఎలిమెంట్స్ రెండూ కనిపిస్తున్నాయి.

సాఫ్ట్ గా ఉండే ఓ కుర్రాడు, తన ప్రేమ కోసం హింసామార్గాన్ని ఎంచుకున్నాడనే విషయం ట్రయిలర్ తో అర్థమైంది. ఓ సెల్ ఫోన్ స్టోర్ లో పనిచేసే అమ్మాయిగా అనఘ నటించింది. హీరోయిన్ వల్ల హీరో కత్తిపట్టాల్సి వచ్చిందనేది గుణ369 కాన్సెప్ట్. ఓ టైమ్ లో హీరో జైలుకు కూడా వెళ్లాడనే విషయాన్ని ట్రయిలర్ లో చూపించారు. అలా గుణ 369 అనే టైటిల్ వెనక సస్పెన్స్ ను రివీల్ చేశారు.

బోయపాటి వద్ద డైరక్షన్ డిపార్ట్ మెంట్ లో పనిచేసిన అర్జున్ జంధ్యాల ఈ సినిమాతో దర్శకుడిగా మారాడు. జ్ఞాపికా ఎంటర్టైన్ మెంట్స్ , ఎస్జీ మూవీ మేకర్స్ బ్యానర్ పై తిరుమల్ రెడ్డి, అనిల్ కడియాల కలిసి ఈ సినిమాను నిర్మించారు. చైతన్ భరధ్వాజ్ సంగీతం అందించిన ఈ సినిమాను ఆగస్ట్ లో విడుదల చేయబోతున్నారు.