"గుణ 369" ఫ‌స్ట్ లుక్ రిలీజ్

Wednesday,May 29,2019 - 03:20 by Z_CLU

టైటిల్ తోనే అందర్నీ ఎట్రాక్ట్ చేసింది గుణ 369. ఇప్పుడీ సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. కార్తికేయ హీరోగా నటిస్తున్న ఈ సినిమాతో బోయపాటి శ్రీను శిష్యుడు అర్జున్ జంధ్యాల దర్శకుడిగా
పరిచయమౌతున్నాడు. ఫస్ట్ లుక్ లో పంచె కట్టులో కార్తికేయ‌ కొత్త‌గా ఉన్నాడు.

సినిమాకు సంబంధించి ఈమధ్య ఒంగోలులో భారీ షెడ్యూల్ పూర్తిచేశారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ నడుస్తోంది. కంటెంట్ పరంగా సినిమా చాలా కొత్తగా ఉంటుందంటున్నారు మేకర్స్. త్వరలోనే రిలీజ్ డేట్ ప్రకటిస్తారు.

స్ప్రింట్‌ ఫిలిమ్స్‌, జ్ఞాపిక ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై అనిల్‌ కడియాల, తిరుమల్‌ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. చైతన్య భరధ్వాజ్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.