`ఎవ‌రు` రిలీజ్ డేట్ ఫిక్స్

Wednesday,July 17,2019 - 12:58 by Z_CLU

`క్ష‌ణం`, `అమీ తుమీ`, `గూఢ‌చారి` వంటి వ‌రుస విజ‌యాల‌తో దూసుకుపోతున్న అడివి శేష్ హీరోగా రూపొందుతోన్న థ్రిల్ల‌ర్ `ఎవ‌రు`. పివిపి సినిమా బ్యాన‌ర్‌పై ఈ సినిమాను నిర్మించారు. వెంక‌ట్ రామ్‌జీ ఈ చిత్రం ద్వారా ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నాడు. ఆగస్ట్ 15న మూవీని థియేటర్లలోకి తీసుకురావాలని నిర్ణయించారు.

ఎవరు సినిమాలో రెజీనా హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఓ కీలక పాత్రలో న‌వీన్ చంద్ర కనిపించబోతున్నాడు. ప్ర‌స్తుతం సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వర్క్ నడుస్తోంది. రీసెంట్ గా మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు.

`క్ష‌ణం` వంటి సూప‌ర్‌హిట్ త‌ర్వాత అడివిశేష్‌, పివిపి కాంబినేష‌న్‌లో వస్తున్న మూవీ కావడంతో “ఎవరు”పై అంచనాలు భారీగా ఉన్నాయి. శ్రీచ‌ర‌ణ్ పాకాల సంగీతం అందిస్తున్న ఈ మూవీకి వంశీ ప‌చ్చిపులుసు సినిమాటోగ్రాఫర్.

న‌టీన‌టులు: అడివిశేష్‌, రెజీనా కసండ్ర‌, న‌వీన్ చంద్ర త‌దిత‌రులు

సాంకేతిక వ‌ర్గం:
ద‌ర్శ‌క‌త్వం: వెంక‌ట్ రామ్‌జీ
నిర్మాత‌లు: పెర‌ల్ వి.పొట్లూరి, ప‌ర‌మ్ వి.పొట్లూరి, కెవిన్ అన్నె
సినిమాటోగ్ర‌ఫీ: వ‌ంశీ ప‌చ్చిపులుసు
సంగీతం: శ‌్రీచ‌ర‌ణ్ పాకాల‌
ఆర్ట్‌: అవినాష్ కొల్ల‌
ఎడిటింగ్‌: గ్యారీ బి.హెచ్‌
డైలాగ్స్‌: అబ్బూరి ర‌వి
కాస్ట్యూమ్స్‌: జాహ్న‌వి ఎల్లోర్‌, సురా రెడ్డి
సౌండ్ ఎఫెక్ట్స్‌: య‌తిరాజ్‌