ఫ్రైడే రిలీజ్

Wednesday,July 26,2017 - 07:36 by Z_CLU

ఈ శుక్రవారం 3 సినిమాలు థియేటర్లలోకి వస్తున్నాయి. అందులో రెండు తెలుగు సినిమాలు. ఇంకోటి హిందీ సినిమా. యాక్షన్ స్టార్ గోపీచంద్, గౌతమ్ నందగా థియేటర్లలోకి వస్తుంటే.. వాసుకిగా నయనతార మరోసారి తెలుగు ప్రేక్షకుల్ని అలరించేందుకు రెడీ అవుతోంది.

ఫిమేల్ ఓరియంటెడ్ మూవీస్ కు కేరాఫ్ అడ్రస్ గా మారిన నయనతార మరోసారి అదే ఫార్మాట్ లో సినిమా చేసింది. అదే వాసుకి. మలయాళంలో ఇప్పటికే సూపర్ డూపర్ హిట్ అయిన  `పుదియ నియ‌మం` అనే సినిమాకు ఇది డబ్బింగ్ వెర్షన్. ఈ సినిమాతో ఉత్తమ నటిగా ఫిలింఫేర్ అవార్డు కూడా అందుకుంది నయన్. డ్రగ్స్, అత్యాచారం బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమాలో, తన అల్టిమేట్ యాక్టింగ్ తో నయనతార అదరగొట్టేసింది. ఆమె పర్ ఫార్మెన్సే సినిమాకు బ్యాక్ బోన్.

ఇక ఈ వీకెండ్ రిలీజ్ కు ముస్తాబవుతున్న మరో సినిమా గౌతమ్ నంద. రెండు డిఫరెంట్ షేడ్స్ లో గోపీచంద్ నటించిన సినిమా ఇది. ఒక పాత్రలో గౌతమ్ గా, మరో పాత్రలో నందాగా కనిపించబోతున్నాడు ఈ యాక్షన్ స్టార్. సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో హన్సిక, క్యాథరీన్ హీరోయిన్లుగా నటించారు. ఇప్పటికే విడుదలైన ట్రయిలర్ రిచ్ గా ఉండడం, తమన్ అందించిన పాటలకు మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి.

బాలీవుడ్ లో ఈ శుక్రవారం ముబారకన్ అనే సినిమా విడుదలవుతోంది. బాబాయ్ అనీల్ కపూర్, అబ్బాయ్ అర్జున్ కపూర్ హీరోలుగా తెరకెక్కిన ఈ సినిమాలో ఇలియానా, నేహా శర్మ హీరోయిన్లుగా నటించారు. కంప్లీట్ రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాకు అనీష్ బజ్మీ దర్శకుడు. పాటలకు ఇప్పటికే మంచి ఊపు రావడంతో సినిమాపై కూసింత అంచనాలు పెరిగాయి.