వినాయక చవితి కానుకగా నారా రోహిత్ సినిమా

Wednesday,July 26,2017 - 06:26 by Z_CLU

నారా రోహిత్ నటించిన “కథలో రాజకుమారి” రిలీజ్ డేట్ ఫిక్సయింది. సినిమాకు ‘U’ సర్టిఫికెట్ వచ్చింది. డిఫెరెంట్ పాయింట్ తో ఇమోషనల్ లవ్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా వినాయకచవితి కానుకగా ఆగష్టు 25 న థియేటర్లలోకి రానుంది.

సినిమాలో నారా రోహిత్ సరసన నమితా ప్రమోద్ హీరోయిన్ గా నటించింది. నాగశౌర్య కీ రోల్ ప్లే చేశాడు. ఇళయరాజాతో పాటు విశాల్ చంద్రశేఖర్ మ్యూజిక్ కంపోజ్ చేసిన ఈ సినిమాకి మహేష్ సూరపనేని డైరెక్టర్. వెంకట శ్రీనివాస్ నిర్మాత.