'షాదీ ముబారక్‌' ఫస్ట్‌ లుక్‌ విడుదల

Wednesday,September 30,2020 - 05:26 by Z_CLU

సక్సెస్‌ఫుల్‌ ప్రొడ్యూసర్‌ దిల్‌రాజు, శిరీష్‌ నిర్మాతలుగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై రూపొందుతోన్న ఔట్‌ అండ్‌ ఔట్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ‘షాదీ ముబారక్‌’. వీర్‌సాగర్‌, దృశ్యా రఘునాథ్‌ హీరో హీరోయిన్లుగా నటిస్తోన్న ఈ చిత్రానికి పద్మ శ్రీ దర్శకత్వం వహిస్తున్నారు.

ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను చిత్ర యూనిట్‌ విడుదల చేసింది. ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించేందుకు ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రధానంగా రూపొందుతోన్న ఈ సినిమా చిత్రీకరణను పూర్తి చేసుకుంది. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలోనే సినిమాను విడుదల చేయడానికి దర్శక నిర్మాతలు ప్లాన్‌ చేస్తున్నారు.

నటీనటులు – వీర్‌సాగర్‌, దృశ్యా రఘునాథ్‌, అదితి, ఝాన్సీ, హేమ, రాజశ్రీనాయర్‌, ప్రియదర్శి రామ్‌, హేమంత్‌, శత్రు, భద్రమ్‌, మధునందన్‌, అజయ్‌ ఘోష్
ఆర్ట్‌: నాని
ఎడిటర్‌: మధు,
సంగీతం: సునీల్‌ కశ్యప్‌,
కెమెరా: శ్రీకాంత్‌ నారోజ్,
నిర్మాతలు: రాజు, శిరీష్‌,
కథ, మాటలు, స్క్రీన్‌ ప్లే, దర్శకత్వం: పద్మ శ్రీ.