సంగీతం ఒకరు.. రీరికార్డింగ్ వేరొకరు

Friday,March 22,2019 - 05:08 by Z_CLU

సినిమాలో సాంగ్స్ కి ఒక ప్రత్యేకత ఉంటుంది. మ్యూజిక్ కంపోజర్ ఎలాంటి ట్యూన్ కంపోజ్ చేసినా  అల్టిమేట్ గా సినిమాలో ఆ సిచ్యువేషన్ కి సింక్ అవ్వాలి. ఇక BGM వరకు వస్తే  దర్శకుడి విజన్ ని కంప్లీట్ గా అడాప్ట్ చేసుకోగలగాలి. ఏ సిచ్యువేషన్  నైనా, దర్శకుడి విజన్ కి తగ్గట్టే    ట్యూన్స్  తో  ట్రాన్స్ లేట్ చేయగలగాలి. అందుకే ఫిల్మ్ మేకర్స్ ఒక్కోసారి సాంగ్స్ కోసం ఒక మ్యూజిక్ డైరెక్టర్ ని ఎంచుకున్నా, BGM వరకు వచ్చేసరికి పల్స్ తెలిసిన మ్యూజిక్ కంపోజర్ నే ప్రిఫర్ చేస్తారు. అలా ఒక సినిమాకి ఇద్దరేసి మ్యూజిక్ కంపోజర్స్ పని చేసిన సినిమాలెన్నో ఉన్నాయి.

మజిలీ : సినిమాకి గోపీ సుందర్ మ్యూజిక్ అందించాడు. సినిమాపై ఇంత బజ్ క్రియేట్ అవుతుందంటే ఓ రకంగా గోపీ సుందర్ కూడా రీజనే. అయితే ఈ సినిమాకి తమన్ కూడా పని చేస్తున్నాడు. ప్రస్తుతం సినిమాలోని సిచ్యువేషన్స్ కి తగ్గట్టు BGM కొట్టే పనిలో ఉన్నాడు. సినిమాలో ఎమోషనల్ సీన్స్ కి స్కోప్ ఎక్కువగా ఉండటంతో BGM బాధ్యతలు తమన్ కి ఇచ్చేశారు మేకర్స్.

సాహో : ప్రభాస్ ‘సాహో’ కి శంకర్-ఎహసాన్-లాయ్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నారు. సినిమాని ఇంటర్నేషనల్ స్థాయిలో తెరకెక్కిస్తున్నారు కాబట్టి బాలీవుడ్ కంపోజర్స్ ని ఎంచుకున్నా, BGM వరకు వచ్చేసరికి మాత్రం తమన్ నే నమ్మాడు దర్శకుడు సుజిత్. ప్రస్తుతం షూట్ అయిన ఫుటేజ్ పై ఆల్రెడీ ట్యూన్స్ తో ప్రయోగాలు చేయడం బిగిన్ చేసేశాడు తమన్.

టచ్ చేసి చూడు : రవితేజ సినిమాకి కూడా ఇదే జరిగింది. సినిమాకి ఎక్స్ పెక్టేషన్స్ ఎక్కువగా ఉండటంతో శంకర్ -ఎహాసన్ – లాయ్ సాంగ్స్ ని ప్రిఫర్ చేసిన BGM వరకు వచ్చేసరికి తమన్ కే ఓటేశారు మేకర్స్.

 

సైరా : మెగాస్టార్ ‘సైరా’ విషయానికి వస్తే అమిత్ త్రివేది మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. కానీ టీజర్ కి BGM కొట్టింది మాత్రం తమన్. ఈ లెక్కన చూస్తే ఆల్మోస్ట్ సినిమాకి కూడా BGM తమన్ అందించే అవకాశాలే కనిపిస్తున్నాయి.

యూటర్న్ : సమాంత లీడ్ రోల్ ప్లే చేసిన సినిమా. సూపర్ హిట్టయిన ఈ థ్రిల్లర్ క్రెడిట్స్ లో BGM ని స్పెషల్ గా మెన్షన్ చేయాలి. పూర్ణ చంద్ర తేజస్వి ఈ సినిమాకి BGM కంపోజ్ చేశాడు. ఇక ప్రమోషనల్ సాంగ్ వరకు వచ్చేసరికి అనిరుద్ సాంగ్ కంపోజ్ చేశాడు.

ఫిదా : బ్లాక్ బస్టర్ సినిమా. ఈ సినిమాకి శక్తికాంత్ కార్తీక్ సాంగ్స్ కంపోజ్ చేశాడు. ఇక సినిమాలోని ప్రతి సన్నివేశాన్ని స్ట్రేట్ గా రీచ్ అయ్యేలా ట్యూన్స్ అందించింది మాత్రం జె.బి., తన కరియర్ లోనే ఫస్ట్ టైమ్ ఒక సినిమాకి ఇద్దరు మ్యూజిక్ కంపోజర్స్ తో పనిచేశాడు శేఖర్ కమ్ముల.

ఇలా చెప్పుకుంటూ పోతే ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ కి మిక్కీ.జే.మేయర్ మ్యూజిక్ కంపోజ్ చేస్తే, మణిశర్మ BGM కంపోజ్ చేశాడు. NTR ‘టెంపర్’ విషయంలో కూడా అదే జరిగింది. అనూప్ రూబెన్స్ మ్యూజిక్ కంపోజ్ చేశాడు, మణిశర్మ BGM అందించాడు.