'గ్యాంగ్ లీడర్' తర్వాత ?

Sunday,August 18,2019 - 04:02 by Z_CLU

కోలీవుడ్ లో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా దూసుకెళ్తున్నప్పటికీ అనిరుద్ కళ్ళు మాత్రం టాలీవుడ్ మీదే ఉన్నాయి.  ‘అజ్ఞాత వాసి’ తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన అనిరుద్ కి  ఆ సినిమా సక్సెస్ అందించలేకపోయింది. ఆ తర్వాత అనిరుద్ ని టాలీవుడ్ పెద్దగా పట్టించుకోలేదు. అయితే కొన్ని నెలలకి ‘జెర్సీ’ పడింది. ఆ సినిమాతో మ్యూజిక్ డైరెక్టర్ గా సక్సెస్ అందుకున్నాడు. సినిమా కూడా విజయం సాదించడంతో అనిరుద్ ఫుల్ బిజీ అవుతాడని అందరూ ఊహించారు.

కానీ అలా జరగలేదు. ‘జెర్సీ’ తర్వాత అనిరుద్ కి తెలుగులో ఊహించిన ఆఫర్స్ రాలేదు. దాంతో మళ్ళీ నానినే ‘గ్యాంగ్ లీడర్’ కి అవకాశం ఇచ్చాడు.  ప్రస్తుతం ఈ యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఆశలన్నీ ఈ సినిమా మీదే ఉన్నాయి. ఈ సినిమాతో టాలీవుడ్ లో పుంజుకోవాలని చూస్తున్నాడు. మరి గ్యాంగ్ లీడర్ తర్వాత అయినా అనిరుద్ టాలీవుడ్ లో బిజీ అవుతాడేమో చూడాలి.