96 రీమేక్ లో ఎలాంటి మార్పులు కోరలేదు

Friday,March 22,2019 - 03:29 by Z_CLU

తనపై వస్తున్న ఓ రూమర్ పై ఫుల్ క్లారిటీ ఇచ్చింది సమంత. తమిళ్ లో సూపర్ హిట్ అయిన 96 సినిమాను తెలుగులో రీమేక్ చేయబోతున్నారు. ఈ రీమేక్ లో కొన్ని మార్పులు సూచించిందట సమంత. తన ఇమేజ్ కు తగ్గట్టు కథలో కొన్ని మార్పులు చేయమని డిమాండ్ చేసిందట. అయితే వీటిని పుకార్లుగా కొట్టిపారేస్తోంది సమంత.

“96 దర్శకుడ్ని రీసెంట్ గా కలిశాను. కేవలం అతడు చెప్పిన కొన్ని ఐడియాస్ మాత్రమే విన్నాను. నేను అతడికి ఏమీ చెప్పలేదు. ఆ ప్రాజెక్టుపై చాలా ఇంట్రెస్ట్ గా ఉంది.”

ఇలా తనపై వస్తున్న పుకార్లకు చెక్ పెట్టింది సమంత. నిజానికి సమంత డిమాండ్ చేయాల్సిన అవసరం లేకుండా, నిర్మాత దిల్ రాజే ఈ కథలో కొన్ని మార్పుచేర్పులు చేయిస్తున్నాడు. ప్రస్తుతం ఆ ప్రాసెస్ నడుస్తోంది.

శర్వానంద్-సమంత హీరోహీరోయిన్లుగా త్వరలోనే సెట్స్ పైకి రాబోతోంది 96 రీమేక్. తెలుగులో మాత్రం దీనికి ఈ టైటిల్ ఫిక్స్ చేయట్లేదు. మరో కొత్త క్యాచీ టైటిల్ పెట్టాలనే ఆలోచనలో ఉన్నారు.