ఇయర్ ఎండ్ స్పెషల్ : సూపర్ హిట్ సాంగ్స్

Thursday,December 26,2019 - 10:13 by Z_CLU

ప్రతి ఏడాది కొన్ని సూపర్ హిట్ సాంగ్స్ మ్యూజిక్ లవర్స్ ను  విపరీతంగా  ఆకట్టుకొని వారి ప్లే లిస్టులో చేరిపోతుంటాయి. ఈ ఏడాది కూడా  కొన్ని బెస్ట్ సాంగ్స్ మ్యూజిక్ లవర్స్ ని బాగా ఆకట్టుకున్నాయి. ఆ సూపర్ హిట్ సాంగ్స్ పై  ‘జీ సినిమాలు’ స్పెషల్ స్టోరీ.

సాఫ్ట్ సాంగ్స్ ఇవ్వడంలో మిక్కీ జె మేయర్ మాస్టర్.. కానీ ఈ ఇయర్ మిక్కీ ఓ పక్కా మాస్ సాంగ్ తో అందరికీ షాక్ ఇచ్చాడు.’గద్దల కొండ గణేష్’ కోసం ఓ అదిరిపోయే సాంగ్ కంపోజ్ చేసి మెస్మరైజ్ చేసాడు. ‘జర్రా జర్రా’ అంటూ వచ్చే ఈ సాంగ్ కి భాస్కరభట్ల రవికుమార్ అదిరిపోయే క్యాచీ లిరిక్స్ అందించాడు. అనురాగ్ కులకర్ణి, ఉమా నేహ పాడిన తీరు కూడా శ్రోతలను బాగా ఆకట్టుకుంది.

 

2019 బెస్ట్ సాంగ్స్ లిస్టులో ‘కడలల్లె వేచే కనులే’,’నీ నీలి కన్నుల్లోన’ మంచి ప్లేస్ అందుకున్నాయి. ‘డియర్ కామ్రేడ్’ సినిమాలోని ఈ పాటలకు జస్టిన్ ప్రభాకరన్ వినసొంపైన  సంగీతం అందిస్తే రెహమాన్ చక్కని తెలుగు పదాలతో మళ్ళీ మళ్ళీ వినాలనిపించేలా సాహిత్యం అందించాడు. సిద్ శ్రీరాం, గౌతం భరద్వాజ్ సింగింగ్ కూడా సాంగ్స్ కి కలిసొచ్చింది.

‘జెర్సీ’ కోసం అనిరుద్ కంపోజ్ చేసిన ‘అదేంటో గాని ఉన్నపాటుగా’ అనే సాంగ్ కూడా ఈ ఇయర్ బెస్ట్ సూపర్ హిట్ సాంగ్స్ లిస్టులో చేరింది. అనిరుద్ సాఫ్ట్ ట్యూన్ కి కృష్ణకాంత్ లిరిక్స్ తోడై సాంగ్ ను సూపర్ హిట్ చేసేసాయి. ఇక అనిరుద్ వాయిస్ కూడా మ్యూజిక్ లవర్స్ కి ఓ కిక్ ఇచ్చింది.

‘ఆర్ ఎక్స్ 100’ తో సూపర్ హిట్ కాంబో అనిపించుకున్న కార్తికేయ -చైతన్య భరద్వాజ్ ఈ ఏడాది ‘గుణ 369’ ఆల్బం తో ఎట్రాక్ట్ చేసింది. అయితే ఆల్బంలో ‘బుజ్జి బంగారం’ మాత్రం మోస్ట్ పాపులర్ నంబర్ గా దూసుకుపోయింది. లవ్ ఫీలింగ్ ని తెలియజేసేలా అనంత్ శ్రీరాం అందించిన సాహిత్యం కూడా సాంగ్ కి ప్రాణం పోసింది. ఇక నకాష్ ,దీప్తి సింగింగ్  ఇలా అన్నీ కలగలిపి సాంగ్ ను 2019 సూపర్ హిట్ సాంగ్స్ లిస్టులో చేర్చాయి.

ఫలక్ నుమా దాస్ లో సిద్ శ్రీరాం పాడిన ‘అరెరే మనసా’ సాంగ్ కూడా ఈ ఇయర్ బెస్ట్ సాంగ్స్ లో ప్లేస్ సంపాదించుకుంది. వివేక్ సాగర్ మ్యూజిక్ కి కిట్టు అందించిన లిరిక్స్ కూడా ప్లస్ అయ్యాయి.

‘నానీస్ గ్యాంగ్ లీడర్’ కోసం అనిరుద్ కంపోజ్ చేసిన ‘హోయన హోయన’ సాంగ్ కూడా మ్యూజిక్ లవర్స్ బాగా ఆకట్టుకొని 2019 సూపర్ హిట్స్ లో ఒకటి అనిపించుకుంది. అనంథ్ శ్రీరాం , ఇన్నో సాహిత్యం తో పాటు ఇన్నో వాయిస్ కూడా అందరినీ ఎట్రాక్ట్ చేసింది.

ఈ ఏడాది తమన్ ‘ఓహ్ బావ’ అనే ఫ్యామిలీ సాంగ్ తో మెస్మరైజ్ చేసి మ్యూజిక్ లవర్స్ ని బాగా ఆకట్టుకున్నాడు. ఈ పాటకు కె కె అందించిన సాహిత్యం అలాగే సింగర్స్ వాయిస్ బాగా కలిసొచ్చింది. సో ఫైనల్ గా మోస్ట్ పాపులర్ నంబర్ అనిపించుకుంది.

‘దొరసాని’ ఆల్బంలో ‘నింగిలోన పాల పుంత’ అనే పాట కూడా ప్రేక్షాదరణ పొంది ఈ ఏడాది సూపర్ సాంగ్ అనిపించుకుంది. ప్రశాంత్ విహారి అందించిన మ్యూజిక్ తో పాటు గోరటి వెంకన్న అందించిన అచ్చ తెలుగు సాహిత్యం ఈ పాటకు ఓ విశిష్టత తీసుకొచ్చింది. అనురాగ్ కులకర్ణి తన గానంతో పాటకు అందం తీసుకొచ్చాడు.

 

‘ఓహ్ బేబీ’ నుండి రిలీజైన ‘చాంగుభళా’ సాంగ్ కూడా యూ ట్యూబ్ లో మంచి వ్యూస్ సాదించి సూపర్ హిట్ అయింది. మిక్కీ జె మేయర్ మ్యూజిక్, భాస్కర భట్ల సాహిత్యం రెండు కలగలిపిన ఈ పాట శ్రోతలను ఆకట్టుకుంది. ఈ ఆల్బంలో ‘ఓహ్ బేబీ’ అంటూ వచ్చే టైటిల్ సాంగ్ కూడా మంచి ఆదరణ పొందింది.

‘రాజా వారు రాణి గారు’ ఆల్బం కూడా ఈ ఏడాది చిన్న సినిమాల్లో బెస్ట్ ఆల్బం అనిపించుకుంది. జయ క్రిష్ కంపోజ్ చేసిన సాంగ్స్ సినిమాకు ప్లస్ అయ్యాయి. ముఖ్యంలో ‘నమ్మెలా లేదె’ , ‘రాజా వారు రాణి గారు’ పాటలు శ్రోతలను బాగా ఆకట్టుకున్నాయి. ఈ రెండు పాటలకు భరద్వాజ్ అందించిన సాహిత్యం చక్కగా కుదిరింది. అలాగే అనురాగ్ కులకర్ణి గానం పాటలకు ప్రాణం పోసింది.

నిఖిల్ ‘అర్జున్ సురవరం’ లోని కన్నె కన్నె అనే సాంగ్ కూడా ఈ ఇయర్ సూపర్ హిట్ సాంగ్స్ లి చోటు సంపాదించుకుంది. సామ్ సీ మ్యూజిక్ ప్లస్  శ్రీమణి లిరిక్స్ కలిసి సాంగ్ ను సూపర్ హిట్ చేసేసాయి. ఇక అనురాగ్ కులకర్ణి , చిన్మయి సింగింగ్ కూడా సాంగ్ బోనస్ అయింది.

ఈ ఇయర్  తమన్ నుండి వచ్చిన సూపర్ హిట్ సాంగ్స్ లో ‘వెంకీ మామ’ టైటిల్ సాంగ్ ఒకటి. తమన్ ఎనర్జిటిక్ ట్యూన్ కి రామజోగయ్య శాస్త్రి అందించిన సాహిత్యం కూడా బాగా ఆకట్టుకొని మంచి సాంగ్ అనిపించుకుంది.

ఈ ఏడాది చివర్లో వచ్చిన ‘ఇద్దరి లోకం ఒకటే’ సినిమాలోని ‘యూ ఆర్ మే హర్ట్ బీట్’ సాంగ్ కూడా మ్యూజిక్ లవర్స్ ప్లే లిస్టులో ప్లేస్ అందుకుంది. మిక్కీ జే మేయర్ మ్యూజిక్ కి లవ్ ఫీలింగ్ తో బాలాజీ అందించిన లిరిక్స్ స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచాయి. అలాగే అనురాగ్ కులకర్ణి తన వాయిస్ తో లవ్ ఫీల్ క్యారీ చేసాడు.