Bangarraju నాగ్ తో చిట్టీ డాన్స్ !

Friday,November 19,2021 - 05:30 by Z_CLU

Faria Abdullah to shake leg with Nagarjuna in Banagarraju

కింగ్ నాగర్జున , నాగ చైతన్య కాంబినేషన్ లో ‘సోగ్గాడే చిన్ని నాయన’ కి సీక్వెల్ గా తెరకెక్కుతున్న ‘బంగార్రాజు‘ కి సంబంధించి  ఇంట్రెస్టింగ్  అప్డేట్ బయటికొచ్చింది. ఈ సినిమాలో వచ్చే స్పెషల్ సాంగ్ లో నాగార్జున తో కలిసి ఫరియా అబ్దుల్లా స్టెప్స్ వేయబోతుంది. ‘సోగ్గాడే చిన్ని నాయన’ తరహాలోనే ‘బంగార్రాజు’ కూడా రొమాంటిక్ గానే తెరకెక్కుతుంది.  అందులో ఒక స్పెషల్ సాంగ్ పెట్టాలని కూడా డిసైడ్ అయ్యారట. దానికి అనూప్ ఓ అదిరిపోయే మాస్ ట్యూన్  రెడీ చేసి రికార్డ్ చేయించేశాడని తెలుస్తుంది. మొదటి సినిమా ‘జాతిరత్నాలు’ తో బిగ్గెస్ట్ హిట్ అందుకున్న హీరోయిన్ ఫరియా అబ్దుల్లా ని ఈ స్పెషల్ సాంగ్ కి ఫైనల్ చేసుకున్నారు.

ఓ సందర్భంలో వచ్చే ఈ స్పెషల్ సాంగ్ నాగ్ , ఫరియా కాంబినేషన్ లో తెరకెక్కనుందని తెలుస్తుంది. ఫరియా మంచి డాన్సర్ అన్న సంగతి తెలిసిందే. ‘జాతిరత్నాలు’ ప్రమోషన్స్ లో ఆమె డాన్స్ వీడియోస్ బాగా వైరల్ అయ్యాయి. ఆ తర్వాత కూడా కొన్ని ఈవెంట్స్ లో తన డాన్సింగ్ టాలెంట్ బయట పెట్టింది ఫరియా. అందుకే ఈ స్పెషల్ సాంగ్ కోసం ఆమెని ఎంపిక చేసుకున్నారు మేకర్స్.

బంగార్రాజు కి సంబంధించి షూటింగ్ ఫైనల్ స్టేజికి చేరుకుంది.  ప్రస్తుతం మైసూర్ లో కొన్ని కీలక సన్నివేశాలు షూట్ చేస్తున్నారు. తిరిగి హైదరాబాద్ రాగానే స్పెషల్ సాంగ్ షూట్ చేయనున్నారు. మరి ఈ సాంగ్ లో నాగ్ తో కలిసి చైతూ కూడా కాలు కదుపుతాడా ?  అనేది తెలియాల్సి ఉంది. అన్నపూర్ణ స్టూడియోస్ , జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది ఆరంభంలో విడుదల కానుంది. త్వరలోనే రిలీజ్ డేట్ ప్రకటించే ప్లానింగ్ లో ఉన్నారు మేకర్స్.

Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics