RRR మూడో సాంగ్ ఎప్పుడంటే ?

Friday,November 19,2021 - 04:32 by Z_CLU

‘RRR’ third song on November 25th

Jr ఎన్టీఆర్ , రామ్ చరణ్ కాంబినేషన్ లో రాజమౌళి తెరకెక్కిస్తున్న RRR నుండి మరో సాంగ్ రిలీజ్ అవ్వబోతుంది. ఇప్పటికే ఈ సినిమా నుండి ‘దోస్తీ’ అనే పాటతో పాటు ‘నాటు నాటు’ అనే మాస్ సాంగ్ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆల్బం నుండి మూడో సాంగ్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. వచ్చే వారం నవంబర్ 25న కీరవాణి కంపోజ్ చేసిన మూడో సాంగ్ ని రిలీజ్ చేయనున్నట్లు సమాచారం.

అయితే ఈసారి వచ్చేది డ్యూయట్ సాంగ్ అని తెలుస్తుంది. అది తారక్ , ఒవియా మధ్య వచ్చే సాంగ్ ఆ ? లేదా చరణ్ , అలియా భట్ కి మధ్య వచ్చే పాటా ? అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం సినిమాకు సంబంధించి అన్నీ సాంగ్స్ కంప్లీట్ అయ్యాయి. సినిమా రిలీజ్ కి రెండు నెలలే ఉండటంతో ఎక్కువ గ్యాప్ లేకుండా ఒక్కో సాంగ్ ని రిలీజ్ చేస్తున్నారు.

 – Pooja Hegde – మాల్దీవులు వెకేషన్

మూడో సాంగ్ రిలీజైన వెంటనే నాలుగో సాంగ్ కూడా రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు మేకర్స్.  డిసెంబర్ చివర్లో లేదా జనవరి 1న న్యూ ఇయర్ స్పెషల్ గా ట్రైలర్ రిలీజ్ చేస్తారనే టాక్ వినబడుతుంది. ఈ లోపు బాలీవుడ్ , కోలీవుడ్ , మల్లువుడ్ , శాండల్ వుడ్ లో టీం ప్రమోషన్స్ కి హాజరవుతారు. ఒక్కో ప్లేస్ లో ఒక్కో ప్రెస్ మీట్ పెట్టి మీడియాతో ఇంటరాక్ట్ అవుతారు. ఇప్పటికే ముంబై మీడియాతో రాజమౌళి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడి వచ్చారు. మళ్ళీ టీం అందరితో అక్కడ కూడా భారీ స్థాయిలో ప్రమోషన్ చేయబోతున్నారు.

Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics