ఎక్స్ క్లూజీవ్ : దిల్ రాజు ఫ్యామిలీ హీరో....'రౌడీ బాయ్స్'

Sunday,December 22,2019 - 12:03 by Z_CLU

ఎట్టకేలకు దిల్ రాజు ఫ్యామిలీ నుండి హీరో వస్తున్నాడు. శిరీష్ తనయుడు అశీష్ ఎంట్రీ సినిమాకు అంతా రెడీ అవుతోంది. ‘హుషారు’ ఫేం శ్రీ హర్ష దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాతో హీరోగా పరిచయమవుతున్నాడు ఆశీష్. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమా జనవరి నుండి సెట్స్ పైకి వెళ్లనుంది.

తాజాగా ఈ సినిమాకు ‘రౌడీ బాయ్స్’ అనే టైటిల్ ఫిక్స్ చేసుకున్నారు. యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న ఈ సినిమాలో కొన్ని పాత్రలకు కొత్త వారిని తీసుకుంటున్నారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి అఫీషియల్ అనౌన్స్ మెంట్ రానుంది.