జనవరిలోనే ముహూర్తం ?

Sunday,December 22,2019 - 01:33 by Z_CLU

త్రివిక్రమ్ , ఎన్టీఆర్ కాంబినేషన్ లో మరో సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే.. ఇంత వరకూ అఫీషియల్ అనౌన్స్ మెంట్ రాలేదు కానీ ఈ కాంబో సినిమా అయితే పక్కా.. దీని కోసం ఇప్పటికే ఏర్పాట్లు జరుగుతున్నాయి.

ఇటివలే తారక్ కి ఓ లైన్ చెప్పిన త్రివిక్రమ్ ఆల్మోస్ట్ కథను రెడీ చేసేసాడట. ‘ఆర్.ఆర్.ఆర్’ షూటింగ్ కూడా ఆల్మోస్ట్ ఎండింగ్ కి వచ్చేసిందంటున్నారు. అందుకే త్రివిక్రమ్ , తారక్ సినిమాకి ముహూర్తం ఖరారు చేసారట. జనవరిలోనే సినిమాకు సంబంధించి పూజా కార్యక్రమాలు నిర్వహించి మళ్ళీ దసరా బరిలో సినిమాను నిలిపెలా ప్లాన్ జరుగుతుందని టాక్.