షూటింగ్ అప్ డేట్స్

Sunday,December 22,2019 - 11:02 by Z_CLU

ప్రస్తుతం టాలీవుడ్ లో కొన్ని సినిమాలు జెట్ స్పీడులో షూటింగ్ జరుపుకుంటుండగా మరి కొన్ని సినిమాలు త్వరలోనే సెట్స్ పైకి వచ్చేందుకు రెడీ అవుతున్నాయి. బిజీ బిజీ షెడ్యూల్స్ తో, ఇంటరెస్టింగ్ కంటెంట్ తో తెరకెక్కుతున్న సినిమాల షూటింగ్ అప్ డేట్స్ మీ కోసం.

మోస్ట్ ఎవైటింగ్ మల్టీ స్టారర్ ‘ఆర్.ఆర్.ఆర్’ సినిమా షూటింగ్ ప్రస్తుతం అరకులో జరుగుతుంది. అక్కడ ఎన్టీఆర్ పై కొన్ని కీలక సన్నివేశాలు తీస్తున్నాడు రాజమౌళి. డి.వి.వి.దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది జులై 30న థియేటర్స్ లోకి రానుంది.

సూపర్ స్టార్ మహేష్ -అనీల్ రావిపూడి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘సరిలేరు నీకెవ్వరు’ షూటింగ్ పూర్తి చేసుకుంది. జులై 5 నుండి మొదలుగొని డిసెంబర్ 18 వరకూ జరిగిన ఆఖరి షెడ్యుల్ తో టోటల్ షూటింగ్ కి ప్యాకప్ చెప్పేసారు యూనిట్. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమా జనవరి 11న సంక్రాంతి కానుకగా విడుదలవుతోంది.

నితిన్ ‘భీష్మ’ ఫాస్ట్ పేజ్ లో షూటింగ్ జరుపుకుంటుంది. ప్రస్తుతం రోమ్ లోని ఎగ్జోటిక్ లొకేషన్స్ లో సాంగ్ తెరకెక్కించే పనిలో ఉంది యూనిట్. శేఖర్ మాస్టర్ ఈ సాంగ్ కి డాన్స్ కంపోజ్ చేస్తున్నాడు. వెంకీ కుడుముల డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సాగర్ మహతి మ్యూజిక్ కంపోజర్. సితార ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ నిర్మిస్తున్నాడు.

రామ్ పోతినేని హీరోగా కిషోర్ తిరుమల డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ‘రెడ్’ సినిమా షూటింగ్ అమీర్ పేట్ లో జరుగుతుంది. ప్రస్తుతం రామ్ పై కొన్ని కీలక సన్నివేశాలు తీస్తున్నారు. తమిళ్ ‘తడమ్’ కి రీమేక్ గా రూపొందుతున్న ఈ సినిమాకు మణి శర్మ మ్యూజిక్ అందిస్తున్నాడు. స్రవంతి మూవీ బ్యానర్ నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది మార్చ్ లో థియేటర్స్ లోకి రానుంది.

‘V’ సినిమా షూటింగ్ ప్రస్తుతం మనాలిలో జరుగుతుంది. అక్కడ నాని, సుదీర్ బాబు లపై కొన్ని సీన్స్ షూట్ చేస్తున్నారు. దిల్ రాజు నిర్మాణంలో ఇంద్రగంటి మోహన కృష్ణ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో నివేత థామస్ , అదితి రావు హైదరి హీరోయిన్స్ గా నటిస్తున్నారు.