ఎవరు ఫస్ట్ డే కలెక్షన్

Friday,August 16,2019 - 05:27 by Z_CLU

ఫస్ట్ లుక్ రిలీజ్ చేసేంత వరకు సినిమా గురించి ఎవ్వరికీ తెలియదు. ట్రయిలర్ రిలీజ్ చేసేంత వరకు ఇంత స్టఫ్ ఉంటుందని ఎవ్వరికీ తెలియదు. థియేటర్లలోకి వచ్చి మొదటి ఆట పడేవరకు ఇంత ఉత్కంఠతో సాగుతుందని ఎవ్వరూ ఊహించలేదు. అందుకే ఎవరు సినిమా మెల్లగా ఉపందుకుంటోంది. అయినప్పటికీ ట్రయిలర్ తో వచ్చిన హైప్ కారణంగా మొదటి రోజు ఈ సినిమాకు కోటి 62 లక్షల రూపాయల షేర్ వచ్చింది.

అడివి శేష్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఓపెనర్ గా నిలిచింది ఎవరు సినిమా. గతంలో ఇతడు నటించిన క్షణం, గూఢచారి సినిమాలకు ఈ స్థాయిలో ఓపెనింగ్స్ లేవు. నిజానికి ఎవరు ఓపెనింగ్స్ కు కారణం ట్రయిలర్ తో పాటు ఆ గత చిత్రాలు కూడా.

సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో ఈ మూవీ క్రమంగా ఊపందుకునే అవకాశాలున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా 7 కోట్ల రూపాయల ప్రీ-రిలీజ్ బిజినెస్ చేసింది. ప్రస్తుతం నడుస్తున్న మౌత్ టాక్ ప్రకారం చూసుకుంటే.. మరో 3 రోజుల్లో ఇది బ్రేక్-ఈవెన్ అవుతుందని ట్రేడ్ ఎనలైజ్ చేస్తోంది.

ఏపీ, నైజాం ఫస్ట్ డే షేర్
నైజాం – రూ. 0.64 కోట్లు
సీడెడ్ – రూ. 0.16 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ. 0.21 కోట్లు
ఈస్ట్ – రూ. 0.21 కోట్లు
వెస్ట్ – రూ. 0.08 కోట్లు
గుంటూరు – రూ. 0.13 కోట్లు
కృష్ణా – రూ. 0.15 కోట్లు
నెల్లూరు – రూ. 0.04 కోట్లు