చైనాలో 2.O హంగామా

Friday,August 16,2019 - 05:05 by Z_CLU

ఇండియాలో సంచలనం సృష్టించింది రజనీకాంత్ నటించిన 2.O సినిమా. భారత్ లో అత్యథిక బడ్జెట్ తో తెరకెక్కిన సినిమా ప్రస్తుతానికి ఇదే. ఇప్పుడీ సినిమా చైనాలో కూడా భారీ ఎత్తున విడుదలకానుంది. వంద, 2 వందలు కాదు.. ఏకంగా 47వేలకు పైగా థియేటర్లలో 2.O విడుదలకాబోతోంది. ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే.. ఇవన్నీ 3డీ స్క్రీన్స్.

2.O సినిమాను 3డీలో చూస్తేనే కిక్. ఇండియాలో కూడా ఎక్కువమంది ఈ సినిమాను త్రీడీలోనే చూశారు. మరీ ముఖ్యంగా చిన్నారులైతే ఎగబడ్డారు. అందుకే కాస్త ఆలస్యమైనప్పటికీ చైనాలో కూడా ఈ సినిమాను త్రీడీలోనే భారీ ఎత్తున విడుదల చేయాలని మేకర్స్ భావించారు. అందుకే లేట్ అయినా భారీ ఎత్తున దిగుతున్నారు. చైనాలో ఓ విదేశీ చిత్రం ఇంత భారీఎత్తున రిలీజ్ కావడం ఇదే తొలిసారి. అవతార్, ఎవెంజర్స్ కు కూడా ఈ ఘనత దక్కలేదు.

శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో మొత్తంగా 3 గెటప్స్ లో కనిపించాడు రజనీకాంత్. విలన్ గా బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ నటించడం హైలెట్. ఎమీ జాక్సన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు రెహ్మాన్ సంగీతం అందించాడు. సెప్టెంబర్ 6న చైనాలో గ్రాండ్ గా రిలీజ్ అవుతోంది 2.O. ప్రస్తుతం చైనాలో ఈ సినిమా ప్రమోషన్ భారీ ఎత్తున జరుగుతోంది. దాదాపు అన్ని ముఖ్యపట్టణాల్లో 2.O హంగామా కనిపిస్తోంది.