చిరంజీవి-పవన్ మల్టీస్టారర్ బడ్జెట్ ఎంతో తెలుసా..?

Thursday,February 09,2017 - 05:35 by Z_CLU

మెగాస్టార్, పవర్ స్టార్ కాంబినేషన్ లో సినిమా అనగానే టాలీవుడ్ లో ఒక్కసారిగా పెద్ద సెన్సేషన్ క్రియేట్ అయింది. పైగాా మెగా ఫ్యాన్స్ పల్స్ తెలిసిన డైరెక్టర్ త్రివిక్రమ్ ఈ సినిమాకి డైరెక్టర్ అనగానే, ఫ్యాన్స్ ఫీస్ట్ లా రిసీవ్ చేసుకున్నారు. ఈ సినిమాని కళాబంధు TSR, అశ్వనీదత్ కలిసి నిర్మిస్తున్నారు. అయితే ఇక్కడే ఓ మెగా క్వశ్చన్ రేజ్ అవుతుంది. అదే సినిమా బడ్జెట్.

మెగా మల్టీస్టారర్ మూవీ బడ్జెట్ ఆకాశాన్ని తాకే అవకాశాాలు స్పష్టంగా ఉన్నాయి. ఎందుకంటే, ప్రస్తుతం టాలీవుడ్ లో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరోల్లో పవన్ కూడా ఒకరు. అటు చిరంజీవి కూడా 150వ సినిమాతో తన స్టామినా, మార్కెట్ పవరేంటో రుచిచూపించారు. సో.. వీళ్లిద్దరి పారితోషికాలకే భారీ బడ్జెట్ అయిపోతుంది. అటు స్టార్ డైరక్టర్ గా కొనసాగుతున్న త్రివిక్రమ్ కూడా భారీగానే తీసుకుంటాడనడంలో ఎలాంటి డౌట్స్ అక్కర్లేదు. వీళ్ల ముగ్గురికి తోడు నయనతార, అనుష్క, సమంత లాంటి హీరోయిన్లను తీసుకుంటే.. ఆ బడ్జెట్ మరింత పెరగడం ఖాయం.
Pawan attending in Khaidi No 150 pre release Function ?

హై ఎండ్ చరిష్మా ఉన్న ఈ ఇద్దరు స్టార్స్ ని ఒకే స్క్రీన్ పైకి తీసుకు వచ్చే సబ్జెక్ట్ ఎలా ఉండబోతుందా అనే ఆలోచన ఎలా ఉన్నా, ఈ సినిమాకి ఎస్టిమేట్ బడ్జెట్ ఎంత అన్నదే ఇప్పుడు అటు మెగా ఫ్యాన్స్ లోను, టాలీవుడ్ లోను ట్రావెల్ చేస్తున్న క్వశ్చన్. మరి ఈ రేంజ్ మెగా మల్టీ స్టారర్ కి నాంది పలికిన మెగా ప్రొడ్యూసర్స్ డైరీలో ఉన్న ఎస్టిమేషన్ తెలియాలంటే ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.