ఓం నమో వెంకటేశాయ ఎట్రాక్షన్స్

Thursday,February 09,2017 - 06:35 by Z_CLU

ఓం నమో వెంకటేశాయ ఎట్రాక్షన్స్

నాగార్జున హాతీరాం బాబాగా రాఘవేంద్ర రావు డైరెక్షన్ లో తెరకెక్కిన ఓం నమో వెంకటేశాయ రేపు రిలీజ్ కానుంది. అనౌన్స్ చేసినప్పటి నుండి పాజిటివ్ బజ్ ని బ్యాగ్ లో వేసుకుంటున్న ఈ సినిమాని, ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వకూడదు అనుకోవడానికి కొన్ని ఎట్రాక్టివ్ రీజన్స్ హైలెట్ అవుతున్నాయి.

 

నాగార్జున : అక్కినేని నాగార్జునని ఇంతకుముందు ఒకసారి అన్నమయ్యలో వెంకటేశ్వర స్వామి భక్తుడిగా ఆల్ రెడీ చూసేశాం. కానీ హాతీరాం  బాబాగా సరికొత్త క్యారెక్టరైజేషన్ లో మెస్మరైజ్ చేయనున్న నాగ్ ఈ సినిమాకి మేజర్ ఎట్రాక్షన్.

 

అనుష్క : టాలీవుడ్ హీరోయిన్స్ వేరు, అనుష్క వేరు. ఇవి ప్రస్తుతం అనుష్క స్టాండర్డ్స్. ఏ సినిమా చేసిన మ్యాగ్జిమం రిజిస్టర్ అయిపోయే క్యారెక్టర్ లను చూజ్ చేసుకుంటూ వెళ్తున్న అనుష్క ఈ సినిమాలో కృష్ణమ్మలా నటించింది. సాంగ్ ప్రోమో లో, ట్రేలర్స్ లో అనుష్క గెటప్ చూస్తుంటే, ఫుల్ ఫ్లెజ్డ్ గా సిల్వర్ స్క్రీన్ పై చూసేయాలన్న ఆలోచన అంత ఈజీగా మానదు.

 

స్టోరీ : ఈ సినిమాకి మెయిన్ పిల్లర్ కథే. నాగార్జున కానీ KRR కానీ ప్రమోషన్ లో చెప్పినట్టు డివోషనల్ సినిమా చేయను అని ఫిక్స్ అయిన నాగ్ చేతే యస్ అనిపించుకోగలిగాడంటే, ఆ క్రెడిట్ మొత్తం కథకే దక్కుతుంది. కాబట్టి గ్రిప్పింగ్ సోల్ తో సాగిపోయే స్టోరీ, ఈ సినిమాకి మెయిన్ పిల్లర్. దర్శకేంద్రుడు ఆ కథను మరింత రసవత్తరం చేయడంలో వాడుకునే ఎంటర్టైనింగ్ ఎలిమెంట్స్ సినిమాకి అదనపు ఎట్రాక్షన్.

 

పాటలు  : జస్ట్ ONV కే కాదు రాఘవేంద్ర రావు డైరెక్షన్ లో వచ్చే ప్రతి సినిమాలో సాంగ్స్ స్పెషల్ గానే ఉంటాయి. కీరవాణి మ్యూజిక్ రాఘవేంద్ర రావు సినిమాలో అంతర్లీనంగా ఇమిడిపోయే హై ఎండ్ ఎలిమెంట్. దాని గురించి ప్రత్యేకంగా చెప్పుకోనక్కర లేదు. ఇక అన్నమయ్య , శ్రీరామ దాసు సినిమాల్లోనూ కమర్షియల్ ఎలిమెంట్స్ ఇన్సర్ట్ చేయగలిగే KRR ఈ సినిమాలోను సాంగ్స్ ని అద్భుతంగా తెరకెక్కించాడు. దీనికి సాక్ష్యం ఆన్ లైన్ లో రిలీజైన అఖిలాండ కోటి సాంగ్.

 

వెంకటేశ్వర స్వామి : దర్శకేంద్రుడు హీరోయిన్స్ నే కాదు, దేవుణ్ణి ఎట్రాక్టివ్ గా చూపడంలోనూ దిట్ట. ఈ సినిమాతో టాలీవుడ్ లో లాంచ్ అవుతున్న సౌరభ్ గురించి అటు నాగార్జున, ఇటు డైరెక్టర్ బిగినింగ్ నుండి మాట్లాడుతూనే ఉన్నారు. సో ఓం నమో వెంకటేశాయలో ఈ యంగ్ దేవుడు కూడా స్పెషల్ ఎట్రాక్షనే.

 

డివోషనల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఓం నమో వెంకటేశాయ డెఫ్ఫినేట్ గా ప్రతి ఒక్కరిని రీచ్ అవుతుందనే కాన్ఫిడెన్స్ తో ఉంది సినిమా యూనిట్. ఆ కాన్ఫిడెన్స్ ఏ రేంజ్ సక్సెస్ ని బ్యాగ్ లో వేసుకోనుందో చూడాలి.