జీ ఎక్స్ క్లూజివ్: ఈవీవీ స్టయిల్ లో మారుతి సినిమా

Monday,August 06,2018 - 04:58 by Z_CLU

ఈవీవీ సినిమాలకు ఓ మార్క్ ఉంది. తన సినిమాలతో ఆయన ఎంత నవ్విస్తారో, క్లయిమాక్స్ కు వచ్చేసరికి అంతలా ఏడిపిస్తారు. ఇలా రెండూ బ్యాలెన్స్ చేస్తూ సినిమాలు చేశారు కాబట్టే టాలీవుడ్ చరిత్రలో ఓ గొప్ప దర్శకుడిగా నిలిచిపోయారు ఈవీవీ. తనకు ఆయనే ఆదర్శం అంటున్నాడు దర్శకుడు మారుతి. అంతేకాదు.. ఈవీవీ స్టయిల్ లో ఓ సినిమా చేస్తానని ప్రకటించాడు.

‘జీ తెలుగు కామెడీ అవార్డ్స్’ ఫంక్షన్ లో ఈ విషయాన్ని బయటపెట్టాడు మారుతి. ‘మహానుభావుడు’ సినిమాకు గానూ ఈవీవీ స్మారక పురస్కారం అందుకున్న మారుతి… ఈవీవీ తనయులు ఆర్యన్ రాజేష్, అల్లరి నరేష్ చేతులమీదుగా ఈ అవార్డు స్వీకరించారు.

ఈ ఈవెంట్ లో మారుతి మాట్లాడుతూ “ఇంతమంది కమెడియన్స్ ను ఒకే వేదికపై చూస్తుంటే ఎంతో సంతోషంగా ఉందని, త్వరలోనే ఈ.వి.వి. గారి స్టైల్ లో అందరు కమెడియన్స్ తో ఒక కంప్లీట్ కామెడి ఎంటర్ టైనర్ సినిమా చేస్తానని… ఈ ఆలోచన ఇప్పుడే ఇక్కడే పుట్టిందని చెప్పాడు. కుదిరితే ఈ.వి.వి. సినిమా బ్యానర్ లోనే ఆ సినిమా చేస్తానని వేదికపై అనౌన్స్ చేసాడు.”

ఈవీవీ సినిమా బ్యానర్ లోనే ఈ సినిమా ఉంటుంది కనుక కచ్చితంగా అందులో అల్లరి నరేష్ హీరోగా నటిస్తాడు. సో.. త్వరలోనే మారుతి-అల్లరోడి కాంబోలో ఓ హిలేరియస్ ఎంటర్ టైనర్ రాబోతోందన్నమాట.