మరికొన్ని గంటల్లో 'డీజే' ఆడియో రిలీజ్

Sunday,June 11,2017 - 08:06 by Z_CLU

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ – దేవి శ్రీ ప్రసాద్ కాంబినేషన్ లో ఓ ఆల్బమ్ వస్తుందంటే చాలు మ్యూజిక్ లవర్స్ తో పాటు ప్రేక్షకులు కూడా ఆ పాటల కోసం వెయిట్ చేస్తుంటారు.. ఇప్పటి వరకూ వీరిద్దరి కాంబోలో వచ్చిన ప్రతీ ఆల్బమ్ సూపర్ హిట్ ఆల్బమ్స్ నిలిచి మ్యూజిక్ లవర్స్ మెస్మరైజ్ చేయడమే దీనికి రీజన్. ప్రెజెంట్ ఈ కాంబోలో రానున్న డీజే ఆల్బమ్ పై భారీ అంచనాలే ఉన్నాయి.

ఇప్పటికే  విడుదలైన ‘డీజే’ సినిమాలోని రెండు పాటలు సోషల్ మీడియా లో హంగామా చేస్తూ సినిమా పై భారీ హైప్ తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలోని మిగిలిన పాటలను ఈరోజు గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నారు. ఈ ఈవెంట్ కి మెగా స్టార్ చిరంజీవి ముఖ్య అతిధిగా హాజరై ‘డీజే’ ఆడియో ను ఆవిష్కరించనున్నారు. ఇంకా ఈ కార్యక్రమానికి పలువురు సినీ ప్రముఖులు హాజరు కానున్నారు.  ఇప్పటికే ఈ ఫంక్షన్ కి సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ కార్యక్రమాన్ని జీ సినిమాలు ఛానల్ లో సాయంత్రం 7 గంటల నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా  చూడొచ్చు. దిల్ రాజు నిర్మాణంలో హరీష్ శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కిన ‘డీజే’ జూన్ 23 న రిలీజ్ కి రెడీ అవుతుంది.