జీ సినిమాలు-డీజే కంటెస్ట్

Sunday,June 11,2017 - 08:08 by Z_CLU

స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న యాక్షన్ ఎంటర్ టైనర్ దువ్వాడ జగన్నాథమ్-డీజే. మాస్ డైరక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో సూపర్ హిట్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా ఈనెల 23న గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. మరికొన్ని గంటల్లో ఆడియో ఫంక్షన్ ను భారీ ఎత్తున సెలబ్రేట్ చేయబోతున్నారు.

ఈరోజు సాయంత్రం 7 గంటల నుంచి జీ సినిమాలు ఛానెల్ లో డీజే ఆడియో లాంచ్ ఈవెంట్ ను లైవ్ లో చూడొచ్చు. కేవలం చూడ్డం మాత్రమే కాదు.. ప్రసార సమయంలో మీరు బహుమతులు గెలుచుకునే ఛాన్స్ కూడా ఉంది. జీ సినిమాలు ఛానెల్ లో రాత్రి 7 గంటల నుంచి ప్రసారమయ్యే డీజే ఆడియో ఫంక్షన్ లైవ్ చూస్తూ.. అందులో మేమడిగే సులువైన ప్రశ్నలకు SMS ద్వారా సమాధానం చెబితే.. గెలిచిన లక్కీ విన్నర్స్ కు దువ్వాడ జగన్నాథమ్ సినిమా టిక్కెట్స్ అందించబోతున్నాం. సో.. ఇంకెందుకు ఆలస్యం స్టే ట్యూన్ టు జీ సినిమాలు.

(note: ఈ కంటెస్ట్ హైదరాబాద్ కు మాత్రమే పరిమితం)