జీ సినిమాలు ( 10th జూన్ )

Saturday,June 10,2017 - 10:04 by Z_CLU

ఆ ఇంట్లో

నటీ నటులు : చిన్నా, మయూరి

ఇతర నటీనటులు : వినోద్ కుమార్, దేవన, కోట శ్రీనివాస రావు

మ్యూజిక్ డైరెక్టర్ : కోటి

డైరెక్టర్ : చిన్న

ప్రొడ్యూసర్ : S. శ్రీనివాస రెడ్డి , రాజు చౌదరి

రిలీజ్ డేట్ : 2009

చిన్నా ప్రధాన పాత్రలో నటించిన ఆ ఇంట్లో హారర్ ఎంటర్ టైనర్. తన ఇద్దరు పిల్లలతో కొత్త ఇంట్లోకి అడుగు పెట్టిన హీరో అక్కడ ఏం చూశాడు..? అక్కడి పరిస్థితులను ఎదుర్కోవడానికి తాంత్రికుడిని కలుసుకున్న హీరో ఏం తెలుసుకున్నాడు అనేదే ప్రధాన కథాంశం.

 

==============================================================================

చెన్నై ఎక్స్ ప్రెస్ 

నటీనటులు  – షారూక్ ఖాన్, దీపికా పదుకోన్

ఇతర నటీనటులు – సత్యరాజ్, ప్రియమణి, ముకేష్ తివారి, నిక్తిన్ ధీర్

సంగీతం – విశాల్ శేఖర్

స్క్రీన్ ప్లే – దర్శకత్వం –  రోహిత్ షెట్టి

విడుదల తేదీ – 2013, ఆగస్ట్ 8

కంప్లీట్ సౌత్ ఫ్లేవర్ తో తెరకెక్కిన చిత్రం చెన్నై ఎక్స్ ప్రెస్. అందుకే ఈ సినిమా అటు నార్త్ తో పాటు సౌత్ లో కూడా దుమ్ముదులిపింది. తమిళనాడు, ఏపీ, కర్నాటక అనే తేడాలేకుండా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో చెన్నై ఎక్స్ ప్రెస్ సినిమా రికార్డు వసూళ్లు సాధించింది. ఓంశాంతిఓం సినిమాతో దీపికాను హీరోయిన్ గా వెండితెరకు పరిచయం చేసిన షారూక్ ఖాన్… ఆ వెంటనే చెన్నై ఎక్స్ ప్రెస్ లో కూడా ఆమెకు ఛాన్స్ ఇచ్చాడు. యాక్షన్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా.. 2013లో దాదాపు అన్ని రికార్డుల్ని తిరగరాయడమే కాకుండా… ఇండియాలో అత్యంత వేగంగా వంద కోట్లు ఆర్జించిన సినిమాగా రికార్డు సృష్టించింది.

==============================================================================

నార్మ్ ఆఫ్ ద నార్త్ 

డబ్బింగ్ ఆర్టిస్టులు : రాబ్ ష్నీజర్, హేదర్ గ్రాహమ్, మాయ కే, కెన్ జియాంగ్, కోమ్ మేనీ, లోరేటా డివైన్, గ్యాబ్రియల్ ఇగ్లేషియాస్ మరియు తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : స్టీఫెన్ మెకన్

డైరెక్టర్ : ట్రెవర్ వాల్

ప్రొడ్యూసర్ : నికోలస్ అట్లాన్, కెన్ కాట్సుమోటో

రిలీజ్ డేట్ : జనవరి 15, 2016

ట్రెవర్ వాల్  డైరెక్షన్ లో తెరకెక్కిన హాలీవుడ్ ఆనిమేటెడ్ కామెడీ అడ్వెంచర్ ‘నార్మ్ ఆఫ్ ద నార్త్’. న్యూ యార్క్ సిటీ డెవెలపర్ నుండి తన ఇంటిని, ఫ్రెండ్స్ ని ఒక ఎలుగు బంటి ఎలా కాపాడుకుంది అనేదే ఈ సినిమా ప్రధాన కథాంశం.

=============================================================================

విచిత్ర బంధం

నటీ నటులు :  అక్కినేని నాగేశ్వర రావు, వాణిశ్రీ

ఇతర నటీనటులు : S.V.రంగా రావు, చిత్తూర్ వి. నాగయ్య, గుమ్మడి, సత్యనారాయణ, అల్లు రామలింగయ్య తదితరులు.

మ్యూజిక్ డైరెక్టర్ : K.V. మహదేవన్

డైరెక్టర్ : ఆదుర్తి సుబ్బారావు

ప్రొడ్యూసర్ : D. మధుసూదన రావు

రిలీజ్ డేట్ : 1972

ఒకే కాలేజీలో చదువుకుంటున్న మాధవ్ సంధ్య ల అనుబంధం, చెడు అనుభవాలతో మొదలవుతుంది. ఒకానొక పరిస్థితుల్లో మాధవ్ తనకు జరిగిన అన్యాయానికి సంధ్యను అత్యాచారం చేసి ఆ తరవాత ఫారిన్ కి వెళ్ళిపోతాడు. కానీ సంధ్య జీవితం పూర్తిగా చీకటై పోతుంది. తన అవమానాన్ని తట్టుకోలేక సూసైడ్ చేసుకుంటాడు. సంధ్య ఒక బిడ్డకు తల్లి ఆ బిడ్డను అనాథాశ్రమంలో వదిలేస్తుంది. కొన్నాళ్ళకు ఫారిన్ నుండి తిరిగి వచ్చిన మాధవ్, తన కన్నబిడ్డ అనాధాశ్రమంలో పెరుగుతున్నాడని తెలిసి ఏం చేస్తాడు..? చెదిరిపోయిన సంధ్య జీవితాన్ని ఎలా సరిదిద్దుతాడు..? అన్నదే కథాంశం.

=============================================================================

శివపురం

నటీనటులు : పృథ్వీ రాజ్, కావ్య మాధవన్

ఇతర నటీనటులు : మనోజ్ K జయన్, కళాభవన్ మణి, బిజు మీనన్, రియా సేన్, కొచిన్ హనీఫా, సురేష్ కృష్ణ తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : M.G. రాధా కృష్ణన్

డైరెక్టర్ : సంతోష్ శివన్

ప్రొడ్యూసర్ : మనియన్ పిల్ల రాజు

రిలీజ్ డేట్ : 4 నవంబర్ 2005

పృథ్వీరాజ్, కావ్య మాధవన్ నటించిన అల్టిమేట్ ఫ్యాంటసీ థ్రిల్లర్ శివపురం. సంతోష్ శివన్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్టయింది. విమర్శకుల ప్రశంసలు సైతం పొందిన ఈ సినిమా 5 స్టేట్ అవార్డులను దక్కించుకుంది. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఈ సినిమాకి హైలెట్.