మహేష్-రాజమౌళి మూవీ జానర్ ఏంటి?

Wednesday,May 06,2020 - 03:49 by Z_CLU

తన నెక్ట్స్ సినిమా మహేష్ తోనే ఉంటుందని ప్రకటించాడు రాజమౌళి. అప్పట్నుంచి వీళ్లిద్దరి కాంబోలో రాబోతున్న సినిమా ఏ జానర్ లో ఉంటుందనే డిస్కషన్ ఊపందుకుంది. హిస్టారికల్ మూవీనా లేక జేమ్స్‌బాండ్‌ లాంటి స్టయిలిష్ యాక్షన్‌ సినిమానా అనే టాపిక్ చుట్టూ ఎక్కువ చర్చ నడుస్తోంది. ఈ రెండు జానర్లలో ఒకటి మహేష్ మూవీలో కనిపించే ఛాన్స్ ఉందంటూ సోషల్ మీడియాలో తెగ పోస్టులు పడుతున్నాయి.

రాజమౌళి మాత్రం మహేష్ మూవీ జానర్ పై ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. అయితే మహేష్ తో మూవీకి సంబంధించి స్టోరీ సిట్టింగ్స్ మాత్రం స్టార్ట్ చేసిన సంగతిని బయటపెట్టాడు. త్వరలోనే ఈ స్టోరీ డిస్కషన్స్ ఓ కొలిక్కి వచ్చే ఛాన్స్ ఉంది.

అయితే మహేష్ మూవీకి స్టోరీ లాక్ అయినా ఇప్పట్లో ఆ మేటర్ బయటకొచ్చే ఛాన్స్ లేదు. ఎఁదుకంటే.. ప్రస్తుతం రాజమౌళి ఫోకస్ మొత్తం RRR ప్రాజెక్టుపైనే ఉంది. అది కంప్లీట్ అయి, థియేటర్లలోకి వచ్చిన తర్వాతే మహేష్ బాబుతో మూవీపై ఓ క్లారిటీ వస్తుంది.