ఒకేసారి 2 సినిమాలు ఎనౌన్స్ చేస్తాడా?

Saturday,May 09,2020 - 02:15 by Z_CLU

మహేష్ తన నెక్ట్స్ సినిమాను పరశురామ్ దర్శకత్వంలో చేయబోతున్నాడు. ఈ విషయం అందరికీ తెలిసిందే. కాకపోతే ప్రాజెక్టును ఇంకా అఫీషియల్ గా ప్రకటించలేదు. ఈనెల 31న కృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఈ ప్రాజెక్ట్ ను ఎనౌన్స్ చేయాలనేది ప్లాన్. అయితే అదే రోజున మహేష్ బాబు నుంచి మరో సినిమా ప్రకటన కూడా వచ్చే ఛాన్స్ ఉంది.

అవును.. ఇప్పటికే చాలా గ్యాప్ వచ్చేయడంతో.. ఆ రోజున ఒకేసారి 2 ప్రాజెక్టులు ప్రకటించాలనే ఆలోచనలో మహేష్ ఉన్నాడట. మహేష్ ప్రకటించబోయే ఆ రెండో సినిమా కూడా ఆల్రెడీ ఫిక్స్ అయింది.

రాజమౌళి దర్శకత్వంలో చేయబోయే సినిమాను మహేష్ అఫీషియల్ గా ప్రకటిస్తాడట. చాలా ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న ఈ ప్రాజెక్టును RRR తర్వాత సెట్స్ పైకి తీసుకొస్తానని రాజమౌళి ప్రకటించిన సంగతి తెలిసిందే.

పరశురామ్ మూవీతో పాటు.. దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై రాజమౌళి దర్శకత్వంలో రాబోతున్న సినిమాను మహేష్ ప్రకటించే ఛాన్స్ ఉంది.