మహేష్ రాజమౌళి సినిమా ఎప్పుడంటే ?

Sunday,December 08,2019 - 01:02 by Z_CLU

ప్రస్తుతం అనిల్ రావిపూడి డైరెక్షన్ లో ‘సరిలేరు నీకెవ్వరు’ చేస్తున్న మహేష్ బాబు ఈ సినిమాతో సంక్రాంతికి సందడి చేయబోతున్నాడు. ఈ సినిమా తర్వాత అందరూ ఊహించినట్టే వంశీ పైడిపల్లి తో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు. అయితే వంశీ తర్వాత మహేష్ ఎవరితో సినిమా చేస్తాడనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

దీనికి రీజన్ రాజమౌళి -మహేష్ కాంబో. ఎప్పటి నుండో ఈ కాంబినేషన్  సినిమా ఆలస్యమవుతూ వస్తోంది. ఆ మధ్య మహేష్ తో త్వరలోనే సినిమా చేస్తానని ఫ్యాన్స్ కి మాటిచ్చాడు రాజమౌళి. ఇక రాజమౌళి ‘ఆర్.ఆర్.ఆర్’ పూర్తి చేసే లోపు మహేష్ -వంశీ పైడిపల్లి సినిమా సగం పూర్తవుతుంది. సో ఇమిడియట్లీ రాజమౌళి మహేష్ సినిమా ఉంటుందనే టాక్ ఉంది. అలా వంశీ తర్వాత మహేష్ రాజమౌళితో సినిమా ప్లాన్ చేస్తున్నాడట.