జీ సినిమాలు - మే 7

Wednesday,May 06,2020 - 08:30 by Z_CLU

చినబాబు
నటీనటులు : కార్తీ, సాయేషా
ఇతర నటీనటులు : సత్యరాజ్, ప్రియా భవానీ శంకర్, అర్ధన బిను, సూరి, భానుప్రియ, విజి చంద్రశేఖర్, సరోజా, మౌనిక తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : D. ఇమ్మన్
డైరెక్టర్ : పాండిరాజ్
ప్రొడ్యూసర్ : సూర్య
రిలీజ్ డేట్ : 13 జూలై 2018
రుద్రరాజు(సత్య రాజ్)ది పెద్ద కుటుంబం. ఇద్దరు భార్యలు, ఆరుగురు సంతానం. ఐదుగురు అమ్మాయిల తర్వాత మగ పిల్లాడి కోసం ఎదురుచూస్తున్న వేళ ఆఖరివాడుగా కృష్ణంరాజు(కార్తి) పుడతాడు. అందుకే చినబాబు అవుతాడు. పొలం బాధ్యతలతో పాటు కుటుంబాన్ని కూడా చూసుకుంటాడు చినబాబు. వ్యవసాయం అనేది వృతి కాదు… జీవన విధానం అని నమ్మే చినబాబు పల్లెటూళ్ల నుండి సిటీకెళ్ళిన వాళ్లంతా ఎప్పటికైనా సొంత ఊరిలో రైతులుగా స్థిరపడాలనే లక్ష్యంతో రైతుగా జీవితాన్ని కొనసాగిస్తుంటాడు. ఈ క్రమంలో జాలీ సోడా యజమాని నీల నీరధ(సాయేషా)ను తొలిచూపులోనే ప్రేమిస్తాడు.
కానీ చినబాబు అక్కయ్యలకు వయసుకు వచ్చిన ఇద్దరు కూతుర్లుంటారు. మేనమామగా మరదళ్లను చిన్నతనం నుండి అల్లారుముద్దుగా చూసుకుంటాడు. అయితే తనకు నచ్చిన అమ్మాయిని కాకుండా తమ కూతురునే పెళ్లి చేసుకోవాలని చినబాబుతో గొడవకు దిగుతారు ఇద్దరు అక్కలు.
మరోవైపు కులరాజకీయాలు నడుపుతూ ఊరిలో పెద్దమనిషిగా ఉండే సురేందర్ రాజు(శత్రు)ని ఒక స్టూడెంట్ హత్య కేసులో జైలుకు పంపిస్తాడు చినబాబు. పగబట్టిన సురేందర్ రాజు చినబాబుని చంపే ప్రయత్నాల్లో ఉంటాడు. చినబాబు పెళ్ళి మేటర్ తో కుటుంబంలో కలతలొస్తాయి. మరి చినబాబు తన అక్కయ్యలను ఒప్పించి తను ప్రేమించిన అమ్మాయినే పెళ్లి చేసుకున్నాడా… చివరికి సురేందర్ రాజు నుంచి ఎలా తప్పించుకున్నాడు… కుటుంబం మొత్తాన్ని ఎలా కలిపాడనేది మిగతా కథ…

================================

పిల్ల జమీందార్
నటీనటులు : నాని, హరిప్రియ, బిందు మాధవి
ఇతర నటీనటులు : శ్రీనివాస్ అవసరాల, M.S.నారాయణ, రావు రమేష్, శివ ప్రసాద్, తాగుబోతు రమేష్, ధనరాజ్, వెన్నెల కిశోర్ తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : సెల్వ గణేష్
డైరెక్టర్ : G. అశోక్
ప్రొడ్యూసర్ : D.S. రావు
రిలీజ్ డేట్ : 29 సెప్టెంబర్ 2011
న్యాచురల్ స్టార్ నాని తన కరియర్ లో చాలా ఇష్టపడి చేసిన సినిమా పిల్ల జమీందార్. పుట్టుకతో కోటీశ్వరుడైన యువకుడు జీవితం విలువ ఎలా తెలుసుకున్నాడు..? అనే సున్నితమైన కథాంశంతో, పర్ ఫెక్ట్ కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కింది పిల్ల జమీందార్. అష్టా చెమ్మా తరవాత నాని, అవసరాల కలిసి చేసిన సినిమా ఇదే.

============================

జెర్సీ
నటీనటులు : నాని, శ్రద్ధా దాస్
ఇతర నటీనటులు : సత్యరాజ్, మాస్టర్ రోనిత్ కామ్ర, హరీష్ కళ్యాణ్, విశ్వనాథ్ దుద్దుంపూడి, సానుష మరియు తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : అనిరుద్ రవిచందర్
డైరెక్టర్ : గౌతమ్ తిన్ననూరి
ప్రొడ్యూసర్ : సూర్యదేవర నాగవంశి
రిలీజ్ డేట్ : 19 ఏప్రిల్ 2019
అర్జున్ (నాని).. క్రికెట్ అతడి ప్రపంచం. హైదరాబాద్ ప్లేయర్ గా ది బెస్ట్ అనిపించుకుంటాడు. రంజీల్లో కూడా సత్తా చాటుతాడు. కానీ అనుకోని పరిస్థితుల్లో క్రికెట్ ను వదిలేస్తాడు. ప్రేమించిన సారా (శ్రద్ధ శ్రీనాధ్)ను పెళ్లి చేసుకుంటాడు. వాళ్లకు ఓ కొడుకు కూడా పుడతాడు. కానీ క్రికెట్ ను వదిలేసి పదేళ్లయినా జీవితంలో సెటిల్ అవ్వడు అర్జున్. భార్య సంపాదన మీద బతుకుతుంటాడు. ప్రభుత్వ ఉద్యోగం కూడా పోగొట్టుకుంటాడు.
అనుకోని సంఘటనల మధ్య మరోసారి క్రీజ్ లోకి అడుగుపెడతాడు అర్జున్. ఊహించని విధంగా క్రికెట్ బ్యాట్ పట్టుకుంటాడు. 36 ఏళ్ల లేటు వయసులో అర్జున్ ఎందుకు ఈ నిర్ణయం తీసుకుంటాడు? అసలు అర్థాంతరంగా అర్జున్ క్రికెట్ ను వదిలేయడానికి కారణం ఏంటి? క్లయిమాక్స్ లో అర్జున్ ఏం సాధించాడు? అనేది జెర్సీ బ్యాలెన్స్ కథ.

==========================

భగీరథ
నటీనటులు : రవితేజ, శ్రియ
ఇతర నటీనటులు : ప్రకాష్ రాజ్, నాజర్, విజయ్ కుమార్, బ్రహ్మానందం, జీవ, నాజర్, సునీల్, రఘునాథ రెడ్డి తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : చక్రి
డైరెక్టర్ : రసూల్ ఎల్లోర్
ప్రొడ్యూసర్ :మల్లిడి సత్య నారాయణ రెడ్డి
రిలీజ్ డేట్ : అక్టోబర్ 13, 2005
రవి తేజ, శ్రియ హీరో హీరోయిన్స్ గా రసూల్ ఎల్లోర్ దర్శకత్వం లో తెరకెక్కిన సినిమా ‘భగీరథ’. ఈ సినిమాకు ప్రస్తుతం టాప్ డైరెక్టర్ గా గుర్తింపు అందుకున్న కిషోర్ కుమార్ పార్ధసాని (డాలీ) కథ ను అందించారు. కృష్ణ లంక అనే పల్లెటూరి లో జనాలు పడే ఇబ్బందులను ఓ యువకుడు ఎలా పరిష్కరించాడు అనే కథతో ఫామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా లో రవితేజ నటన, శ్రియ గ్లామర్, పల్లెటూరి సీన్స్, చక్రి పాటలు ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా రవి తేజ-ప్రకాష్ రాజ్ మధ్య వచ్చే పోటా పోటీ సీన్స్ అందరినీ అలరిస్తాయి.

===============================

శివలింగ
నటీనటులు : రాఘవ లారెన్స్, రితిక సింగ్
ఇతర నటీనటులు : శక్తి వాసుదేవన్, రాధా రవి, వడివేలు, సంతాన భారతి మరియు తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : S.S. తమన్
డైరెక్టర్ : P. వాసు
ప్రొడ్యూసర్ : R. రవీంద్రన్
రిలీజ్ డేట్ : 14 ఏప్రియల్ 2017
ట్రైన్ లో ప్రయాణిస్తూ హఠాత్తుగా చనిపోయిన రహీం(శక్తి) కేస్ ను ఇంటరాగేషన్ చేయమని పవర్ ఫుల్ సీబీ-సీఐడీ ఆఫీసర్ శివలింగేశ్వర్(లారెన్స్) కు అప్పజెప్తారు కమిషనర్.. అలా కమిషనర్ ఆర్డర్ తో రహీం కేసును టేకప్ చేసిన శివలింగేశ్వర్ తన భార్య సత్యభామ(రితిక సింగ్)తో కలిసి వరంగల్ కి షిఫ్ట్ అవుతాడు. అలా రహీం కేసు ఇన్వెస్టిగేషన్ ప్రారంభించిన లింగేశ్వర్ ఆ కేసులో ఎలాంటి నిజాలు తెలుసుకున్నాడు..? చనిపోయిన రహీం బ్యాక్ గ్రౌండ్ ఏంటి.. ఫైనల్ గా శివలింగేశ్వర్ ఏం చేశాడు.. అనేది సినిమా కథాంశం.

=============================

కృష్ణ
నటీనటులు : రవితేజ, త్రిష కృష్ణన్
ఇతర నటీనటులు : బ్రహ్మానందం, సునీల్, వేణు మాధవ్, ముకుల్ దేవ్, చంద్ర మోహన్, దండపాణి, కళ్యాణి తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : చక్రి
డైరెక్టర్ : V.V.వినాయక్
ప్రొడ్యూసర్స్ : కాశీ విశ్వనాథం, D.V.V. దానయ్య
రిలీజ్ డేట్ : 11 జనవరి 2008
రవితేజ, త్రిష నటించిన కామెడీ యాక్షన్ ఎంటర్ టైనర్ కృష్ణ. V.V. వినాయక్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా రవితేజ కరియర్ లో హైలెట్ గా నిలిచింది. కాశీ విశ్వనాథం, D.V.V. దానయ్య కలిసి నిర్మించిన ఈ సినిమాకి చక్రి సంగీతం హైలెట్ గా నిలిచింది.