డైరెక్టర్ సుధీర్ వర్మ ఇంటర్వ్యూ

Tuesday,August 13,2019 - 04:08 by Z_CLU

శర్వానంద్ హీరోగా తెరకెక్కిన ‘రణరంగం’ స్వాతంత్ర దినోత్సవంగా ఆగస్ట్ 15న థియేటర్స్ లోకి రానుంది. ఈ సందర్భంగా దర్శకుడు సుదీర్ వర్మ మీడియాతో మాట్లాడాడు. ఆ విశేషాలు సుదీర్ మాటల్లోనే…

‘గాడ్ ఫాదర్ 2’ ఇన్స్పిరేషన్ తో

గాడ్ ఫాదర్ 2 సినిమా ఆదర్శంగా తీసుకొని రణరంగం స్క్రీన్ ప్లే రాసుకున్నాను. గ్యాంగ్ స్టర్ సినిమా అంటే ఎవరికైనా మొదటి ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. అందులో సందేహమే లేదు. ఎందుకంటే అదొక బెంచ్ మార్క్ ఫిలిం. ఎంత వరకూ సక్సెస్ అయ్యాం అనేది రిజల్ట్ పై ఆదారపడి ఉంటుంది.


ప్రస్థానం ఇష్టం

శర్వానంద్ చేసిన సినిమాల్లో నాకు ప్రస్థానం బాగా ఇష్టం. ఇద్దరం కలిసి చేస్తే కచ్చితంగా ఇంటెన్సిటీ ఉన్న క్యారెక్టర్ తోనే సినిమా చేయాలని ఫిక్సయ్యాం. తనతో ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఓ సాఫ్ట్ సినిమా చేసే ఆలోచనే లేదు.

రవితేజతో అనుకున్నాను

ఈ కథను ముందుగా రవి తేజ గారికి చెప్పాను. ఆయనకి కథ బాగా నచ్చింది. కానీ ఆ టైంలో రవితేజ గారు రెండు సినిమాలతో బిజీగా ఉండటం వల్ల ఆయన కోసం కథను పక్కన పెట్టాను. అయితే శర్వా కి ఓ సందర్భంలో ఊరికే కథ వినిపించాను. కథ వినగానే శర్వా ఇలాంటి ఛాలెంజింగ్ సినిమా చేయాలనుందని, రవి తేజ గారిని కన్విన్స్ చేయమని అడిగాడు. వెంటనే రవితేజ గారిని విషయం చెప్పి ఆయన సరే అన్నాక శర్వాకి లుక్ టెస్ట్ చేసి సినిమా మొదలుపెట్టాను.

స్క్రీన్ ప్లే… కొత్తగా

చాలా గ్యాంగ్ స్టర్ సినిమాలోచ్చినప్పటికీ రణరంగంలో స్క్రీన్ ప్లే కొత్తగా ఉంటుంది. 90లో ఓ రెండు సంవత్సరాలు జరిగిన విషయం గురించి ఇంత వరకూ తెలుగులో ఎవరూ చూపించలేదు. నేను అది ట్రై చేసాను. సో కంటెంట్ చాలా స్ట్రాంగ్ గా డిఫరెంట్ గా అనిపిస్తుంది.

‘దళపతి’ అనుకున్నాం

సినిమాకు టైటిల్ పెట్టడానికి చాలా టైం పట్టింది. ఒక పవర్ ఫుల్ టైటిల్ కావాలని వెయిట్ చేసాం. దళపతి అనుకున్నాం కానీ దొరకలేదు. సో ఒక రోజు నిర్మాత వంశీ రణరంగం టైటిల్ చెప్పాడు. వినగానే సౌండింగ్ బాగుంది పైగా బ్యాటిల్ ఫీల్డ్ అనే మీనింగ్ వస్తుంది కథకి పర్ఫెక్ట్ అనిపిస్తుందని ఫైనల్ చేసి పెట్టాం.

శర్వా క్యారెక్టర్ హైలైట్

సినిమా అంతా శర్వా క్యారెక్టర్ చుట్టూనే తిరుగుతుంది. తన జర్నీని హైలైట్ చేస్తూ కథ సాగుతుంది. కాజల్ , కళ్యాణీ జస్ట్ పార్ట్శ్ అంతే సినిమా మొత్తం శర్వా గురించే ఉంటుంది.

ఇదే ఛాలెంజింగ్

నా సినిమాల్లో ఇదే ఛాలెంజింగ్ అనిపించింది.  మేకింగ్ పరంగా ఛాలెంజింగ్ అనిపించింది. ఎందుకంటే సినిమాలో కొంత పార్ట్ 90 సంవత్సరంలో జరుగుతుంది. దానికోసం ఒరిజినల్ లోకేషన్స్ వాడలేక అల్యూమినియం ఫ్యాక్టరీలో సెట్ వేసి షూట్ చేశాం. సెల్ ఫోన్స్ లాంటివేం కనిపించకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నాం. కాకినాడలో షూట్ జరిగే సమయాల్లో అక్కడ వెహికల్స్ కనిపించకుండా ఇప్పటి వాతావరణం అని తెలియకుండా షూట్ చేసుకొచ్చాం.


బడ్జెట్ తెలియదు

స్వామిరారా సినిమా తర్వాత చినబాబు గారు నాకు అడ్వాన్స్ ఇచ్చారు. ఇప్పటికి ఆ బ్యానర్ లో చేసే ఛాన్స్ వచ్చింది. సినిమాకు ఎంత బడ్జెట్ అయిందనేది ఇంత వరకూ నాకు తెలియదు. ఎప్పుడూ వంశీ నాతో బడ్జెట్ గురించి డిస్కస్ చేయలేదు. ఒక మంచి సినిమా వస్తుందంటే ఎంతైనా పెట్టే ప్రొడక్షన్ దొరికినందుకు హ్యాపీ.

మేకింగ్ టైం తక్కువే

లాస్ట్ ఇయర్ ఏప్రిల్ లో  సినిమా స్టార్ట్ చేశాం. ఒరిజినల్ లోకేషన్స్ లో చేయలేక మళ్ళీ సెట్ వేసి చేయడం జరిగింది. అనుకోకుండా షూటింగ్ టైంలో శర్వా పడిపడి లెచే మనసు సినిమా చేయాల్సి వచ్చింది. సో మధ్యలో కొన్ని నెలలు ఆ సినిమాకోసం కేటాయించాడు. అలా ఆలస్యం జరిగింది.

క్యారెక్టర్స్ కి పర్ఫెక్ట్

సినిమాలో గీత క్యారెక్టర్ కి కళ్యాణి అయితే పర్ఫెక్ట్ అనుకున్నాం. తను చాలా క్యూట్ గా ఉంటుంది. సెకండ్ హాఫ్ లో వచ్చే రోల్ కి అందరి ఛాయిస్ కాజల్ . సో కాజల్ స్టోరీ చెప్పగానే నచ్చి ఒకే చెప్పి చేసింది.

అందుకే రిపీట్ చేసాను

సినిమాలో విజువల్స్ ఎక్స్ట్రా ఆర్డినరీగా ఉంటాయి. ట్రైలర్ లో షాట్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. కేశవ సినిమాకు పనిచేసిన దివాకర్ మణి ఈ సినిమాకు సినిమాటోగ్రఫీ చేసాడు. విజువల్స్ కి ఎలాంటి కాంప్లిమెంట్స్ అయినా తనకే చెందాలి. సినిమాకు బెస్ట్ విజువల్స్ ఇచ్చాడు.

కథలున్నాయి

ప్రస్తుతం కొన్ని కథలున్నాయి. ‘రణరంగం’ రిలీజ్ తర్వాత నెక్స్ట్ సినిమా గురించి ఆలోచిస్తాను.