రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో నాని?

Tuesday,August 13,2019 - 04:50 by Z_CLU

చిలసౌ మూవీతో నేషనల్ అవార్డ్ దక్కించుకున్న రాహుల్ రవీంద్రన్, రీసెంట్ గా నాగార్జునతో మన్మథుడు-2 సినిమా తీశాడు. ప్రస్తుతం ఈ సినిమా థియేటర్లలో నడుస్తోంది. ఇప్పుడీ దర్శకుడు తన మూడో సినిమాకు రెడీ అవుతున్నాడు. అన్నీ అనుకున్నట్టు జరిగితే నాని హీరోగా రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో ఓ సినిమా రాబోతోంది.

జెర్సీ తర్వాత సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై మరో సినిమా చేస్తానని ప్రకటించాడు నాని. ఇప్పుడు అదే బ్యానర్ పై రాహుల్ రవీంద్రన్ కూడా ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. సో.. వీళ్లిద్దరూ కలిసి సినిమా చేసే అవకాశం ఉంది. త్వరలోనే దీనిపై ఓ అఫీషియల్ స్టేట్ మెంట్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది.

గ్యాంగ్ లీడర్ సినిమాను రిలీజ్ కు రెడీ చేసిన నాని, ప్రస్తుతం ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో V అనే సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ తర్వాత రాహుల్ రవీంద్రన్ డైరక్షన్ లో సినిమా చేసే ఛాన్స్ ఉంది.