పరశురామ్ (బుజ్జి) ఎక్స్ క్లూజీవ్ ఇంటర్వ్యూ

Thursday,August 16,2018 - 07:35 by Z_CLU

తన మార్క్ హీరోఇజంతో , ఎమోషనల్ సీన్స్ తో బ్యాక్ టు బ్యాక్ సూపర్ హిట్స్ అందుకుంటున్న దర్శకుడు పరశురాం(బుజ్జి) లేటెస్ట్ గా ‘గీత గోవిందం’తో మరో సూపర్ హిట్ అందుకున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా భారీ కలెక్షన్స్ తో బ్లాక్ బస్టర్ రేంజ్ కి దూసుకెళ్తుంది. ఈ సందర్బంగా దర్శకుడు పరశురాం(బుజ్జి) ‘జీ సినిమాలు’తో ఎక్స్ క్లూజీవ్ గా మాట్లాడారు. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే…

 

ఇట్స్ ఏ బిగ్ డే

సినిమా మేము అనుకున్న రేంజ్ కంటే ఎక్కువే రీచ్ అయ్యింది. మార్నింగ్ షో కే బ్లాక్ బస్టర్ టాక్ వచ్చేసింది. సినిమా చూసి ఫుల్ గా ఎంజాయ్ చేసామని చాలా మంది ఫోన్స్ చేసి చెప్తున్నారు. అవన్నీ వింటూ రెస్పాన్స్ చూస్తుంటే చేప్పలేనంత ఆనందంగా ఉంది. అలాగే మెగాస్టార్ చిరంజీవి గారు సినిమా చూసి చాలా సేపు మాట్లాడారు. ఆయనకి సినిమా చాలా నచ్చింది. ప్రతీ సన్నివేశం గురించి ఎంతో క్లారిటీ గా మాట్లాడారు. అలాగే రాజమౌళి గారు, మహేష్ బాబు గారు సినిమా చూసి ట్విట్టర్ లో వారి స్పందన చెప్తూ అభినందించడం మరింత ఆనందాన్నిచ్చింది. ఇట్స్ ఏ బిగ్ డే ఫర్ మీ. ఈ కథ సక్సెస్ అవుతుందని నమ్మి, నాకు అన్నీ అందించి ఈ రేంజ్ హిట్ కి కారణమైన అల్లు అరవింద్ గారికి , బన్నీ వాస్ గారికి స్పెషల్ థాంక్స్.

 

నా రేంజ్ పెంచింది

‘గీత గోవిందం’ దర్శకుడిగా నా రేంజ్ పెంచింది. షూటింగ్ స్టేజి లో మంచి హిట్ సినిమా అవుతుందని అనుకున్నాను కానీ ఈ రేంజ్ హిట్ ఊహించలేదు. ముఖ్యంగా మెగాస్టార్ , రాజమౌళి గారు, మహేష్ గారు , పూరి అన్నయ్య , నేను పనిచేసిన దర్శకులందరూ ప్రశంసించడం ఎంతో సంతృప్తినిచ్చింది.

 

అల్లు అర్జున్ గారికే చెప్పా

‘శ్రీరస్తు శుభమస్తు’ సినిమా తర్వాత ఈ కథ రెడీ చేసి అల్లు అరవింద్ గారి ద్వారా ముందుగా అల్లు అర్జున్ గారికి చెప్పాను. ‘సరైనోడు’ రిలీజ్ తర్వాత ఆయన ఈ స్టోరీ విన్నారు. స్టోరీ ఆయనకు బాగా నచ్చింది. కాని ఈ కథ నాకు సూట్ అవ్వదేమో అనిచెప్పారు. ఎవరైనా యంగ్ హీరోతో చేస్తే కచ్చితంగా మంచి సూపర్ హిట్ సినిమా అవుతుందనన్నారు. అక్కడి నుండి ఆయన ఈ సినిమాను ఎంతో ప్రేమిస్తూ ప్రతీ క్షణం సపోర్ట్ చేసారు. ముఖ్యంగా హీరోయిన్ కోసం ముగ్గురు స్టార్ హీరోయిన్స్ తో స్వయంగా మాట్లాడి నన్ను నమ్మండి ఈ సినిమా మీకు మంచి పేరు తెస్తుందని చెప్పడంతో ఆయన మీద మరింత గౌరవం పెరిగింది .. ఆ టైంలో ఈ కథను నాకంటే ఆయనే ఎక్కువగా నమ్మారనిపించింది. సినిమా చూసాక మనం నమ్మినట్టే మంచి సినిమా తీసావ్ అంటూ ప్రత్యేకంగా అభినందించారు.

 

ఒకే కథతో ….

పూరి అన్నయ్య దగ్గర ‘అమ్మ నాన్న తమిళమ్మాయి’ సినిమాకు అప్రెంటిస్ గా జాయిన్ అయ్యాను. ఆ తర్వాత ‘ఆంద్రావాలా’,’143′ సినిమాలకు డైరెక్షన్ డిపార్ట్ మెంట్ లో పనిచేసాను. ఆ తర్వాత వీరు పొట్ల దగ్గర , ఆలాగే దశరథ్ గారి దగ్గర బొమ్మరిల్లు భాస్కర్ దగ్గర పరుగు సినిమాకు పనిచేసాను. ఆ తర్వాత యువతతో దర్శకుడిగా మారాను. ఆ టైంలో కేవలం ఒక్క కథతోనే డైరెక్టర్ గా కెరీర్ స్టార్ట్ చేసాను. అక్కడి నుండి ఒక్కో కథ రాసుకుంటూ డైరెక్టర్ గా ఇంత వరకూ వచ్చాను.

 

ఆ గ్యాప్ లో నాలుగు కథలు

‘సారొచ్చారు’ తర్వాత ఓ రెండేళ్ళ గ్యాప్ దొరికింది. ఆ టైంలో నాలుగు కథలు రెడీ చేసుకున్నాను. అందులో ఒకటి ‘శ్రీ రస్తు శుభమస్తు’ మరొకటి ‘గీత గోవిందం’. ప్రస్తుతం మరో రెండు కథలున్నాయి.

 

బ్యాడ్ ఎక్స్ పిరియన్స్

‘సారొచ్చారు’ మంచి కథే కాని వర్కౌట్ అవ్వలేదు. ఎందుకో సరిగ్గా ఎగ్జి క్యూషన్ చేయలేకపోయాను. కొన్ని కారణాల వల్ల అది జస్ట్ ఓకే సినిమాగా మిగిలిపోయిందంతే. నా కెరీర్ లో అదో బ్యాడ్ ఎక్స్ పిరియన్స్.


కథ రెండు సార్లు విన్నాడు

అల్లు అర్జున్ గారు చెప్పినట్టు ఈ కథకు ఎవరు సూట్ అవుతారా.. అనుకుంటుండగా సడెన్ గా విజయ్ మైండ్ లో స్ట్రైక్ అయ్యాడు. వెంటనే అల్లు అరవింద్ గారికి, బన్నీ వాస్ గారికి చెప్పి విజయ్ ని కలిసాను. సరిగ్గా అప్పుడే పెళ్లి చూపులు రిలీజ్ అయింది. అర్జున్ రెడ్డి పోస్ట్ ప్రొడక్షన్ లో ఉంది. స్టోరీ విని బాగుంది కానీ నాకు ఎంత వరకూ కరెక్ట్ అంటూ కన్ఫ్యూజన్ లో పడ్డాడు విజయ్. మళ్ళీ ఒక సారి చెప్పమంటే వెళ్లి చెప్పాను. రెండో సారి గోవిందం క్యారెక్టర్ కి బాగా కనెక్ట్ అయ్యాడు. వెంటనే ఎస్ ఈ సినిమా చేస్తున్నా అన్న అని చెప్పేసాడు. ఫస్ట్ డే నుండే క్యారెక్టర్ లో పూర్తిగా ఇన్వాల్వ్ అయిపోయి గోవిందం క్యారెక్టర్ కి బెస్ట్ ఇచ్చాడు. చాలా సార్లు విజయ్ పెర్ఫార్మెన్స్ చూసి డైరెక్టర్ గా వండర్ అవుతుండే వాణ్ణి. ఫైనల్ గా ఎడిటింగ్ లో తన ఫ్యామిలీ తో సినిమా చూసి విజయ్ చాలా హ్యాపీ గా ఫీలయ్యాడు.

 

లావణ్య ప్లేస్ లో రష్మిక.. రీజన్ అదే

షూట్ కి వెళ్ళే ముందు గీత రోల్ కి కొంత మంది హీరోయిన్స్ ను అనుకున్నాం. ఒక 25 మందికి స్టోరీ కూడా వినిపించాను. కొత్త అమ్మాయిలను కూడా ఆడిషన్ చేసాము. చివరిగా లావణ్య త్రిపాటి ను ఫైనల్ చేసి ఫోటో షూట్ చేసాం. కానీ సరిగ్గా లావణ్య అప్పుడే ఓ తమిళ్ సినిమాకు సైన్ చేసింది… డేట్స్ కుదరకపోవడంతో రష్మిక ఈ ప్రాజెక్ట్ లోకి వచ్చింది.. గీత క్యారెక్టర్ కి మేము అనుకున్నదానికంటే ఇంకా ఎక్కువే న్యాయం చేసింది.

 

సంస్కారం ఎక్కువంతే

నా హీరోలు డైనమిక్ గానే ఉంటారు. కాకపోతే కాస్త సంస్కారం ఎక్కువ అంతే . నిజానికి హీరో అంటే అలా ఉంటేనే బాగుంటుందని నా ఫీలింగ్. రెగ్యులర్ సినిమాల్లో లాగే అమ్మాయిల వెంట పడుతూనే వారిని గౌరవిస్తూ కాస్త సంస్కారంతో ఉండటం నా హీరోల నైజం.

 

కథ గురించే ఆలోచిస్తాను

సినిమా చేసే ముందు కేవలం కథ గురించే ఆలోచిస్తాను. ఆ తర్వాతే క్యారెక్టర్స్ , సీన్స్ , డైలాగ్స్ గురించి ఆలోచిస్తుంటా. ఏదైనా ఎగ్జైట్ కలిగించే పాయింట్ మైండ్ లోకొస్తే చాలు వెంటనే కథగా రాసే ప్రయత్నం చేస్తాను. కథ మీద పూర్తిగా గ్రిప్ తెచ్చుకున్నాకే షూట్ మొదలుపెడతా. అందుకే ఇన్నేళ్ళ పాటు దర్శకుడిగా ఉండగలిగాను.

 

వాటితోనే సెపరేట్ ఇమేజ్ 

అందరూ మీ సినిమాలో ఎమోషనల్ సీన్స్ , డైలాగ్స్ బాగుంటాయని అంటుంటారు. డైలాగ్స్ మీద నేనెప్పుడు పెద్దగా ఫోకస్ పెట్టను. ఈ స్విచువేషన్ లో అలాంటి సీన్ పడాలి.. డైలాగ్స్ అదరగోట్టేయాలి అంటూ పెద్దగా ఆలోచించను. రేపు తీసే సేన్ కి ఒక రోజు ముందు నాకు అనిపించిన డైలాగ్స్ నేచురల్ గా రాసుకుంటుంటాను. అలా నా సినిమాలో నేను రాసిన డైలాగ్స్, ఎమోషనల్ సీన్స్ నాకంటూ ఓ సెపరేట్ ఇమేజ్ తీసుకొచ్చాయి.


62 రోజుల్లోనే

పరశురాం షూటింగ్ కి చాలా టైం తీసుకున్నాడు.. సినిమా లేట్ అన్నప్పుడల్లా నవ్వొచ్చేది. నిజానికి ఈ సినిమాను కేవలం 62 రోజులు అంటే రెండు నెలల్లోనే ఫినిష్ చేసాను. ప్రీ ప్రొడక్షన్ కి, హీరోయిన్ సెలెక్షన్ కే కాస్త టైం పట్టింది.

 

అందులో నాకు పట్టుంది

నా సినిమాల ద్వారా మ్యూజిక్ లవర్స్ కి ప్రతీ సారి బెస్ట్ ఆల్బం అందించాలనుకుంటాను. చిన్నతనం నుండి సాంగ్స్ నా లైఫ్ లో చాలా కీ రోల్ పోషించాయి. బేసిక్ గా నేను సింగర్ ని. ప్రొఫెషనల్ సింగర్ కాదు కాని బాగానే పాడేవాడిని. ఆల్మోస్ట్ రెండు వేల పాటలు కంప్లీట్ గా పాడగలను. అందుకే సాంగ్స్ విషయంలో కాస్త ఎక్కువ కేర్ తీసకుంటాను. మ్యూజిక్ లో పెద్దగా ఇన్వాల్వ్ అవ్వను కాని ట్యూన్ విని జడ్జిమెంట్ చెప్పగలను. ఆ జడ్జి మెంట్ తో, సంగీతం, సాహిత్యం మీద నాకున్న పట్టుతో నాకెలాంటి సాంగ్స్ కావాలో తీసుకుంటుంటాను. ‘గీత గోవిందం’ ఆల్బం పెద్ద హిట్ అవ్వడానికి గోపి సుందర్ గారు లిరిక్స్ రైటర్స్, సింగర్సే కారణం.

 

అలా ఆలోచిస్తా

నా సినిమాలో ఇంపార్టెంట్ సీన్స్ కి సంబంధించి ఈ సీన్ ని త్రివిక్రమ్ గారైతే ఎలా రాసుకుంటారు.. పూరి అన్నయ్య ఎలా రాస్తాడు.. అంటూ ఇలా ఒక్కొక్కరితో కంపేర్ చేసుకుంటూ నా స్టైల్ లో ఆ సన్నివేశం రాసుకుంటాను. ఆ టైంలో వారందరూ నాకు స్ఫూర్తి.

 

ఆ సీన్ సినిమాను నిలబెట్టింది

విజయ్ గోవింద్ ను అసహ్యించుకునే గీత ఏదో టైంలో తనను అర్థం చేసుకునేలా ఒక సీన్ పడాలని కాస్త ఆలోచించి ఒక సీన్ రాసుకున్నాను. అదే సినిమాలో హైలైట్ గా నిలిచింది. ఒక అమ్మాయి లైఫ్ గురించి ఆలోచిస్తూ విజయ్ డైలాగ్స్ చెప్పే సీన్ సినిమాను నిలబెట్టింది. ఆ సీన్ లో నేను రాసింది ఒకేత్తైతే విజయ్ పెర్ఫార్మెన్స్ మరో ఎత్తు.

 

ఇంకా పెద్ద ట్రాక్

రాహుల్ రామకృష్ణ కామెడి తో పాటు అన్నపూర్ణమ్మ -వెన్నెల కిషోర్ కామెడి కూడా థియేటర్స్ లో బాగా పేలింది. వాళ్ళిద్దరి కామెడీ ట్రాక్ చాలా పెద్దది. లెంగ్త్ ఎక్కువ కావడంతో షూట్ చేసిన స్కీన్స్ సినిమాలో పెట్టలేకపోయాం. అన్నపూర్ణమ్మ గారిది పర్ఫెక్ట్ టైమింగ్ ఇక వెన్నెల కిషోర్ కనిపిస్తేనే థియేటర్స్ లో నవ్వేస్తారు. కామెడి ట్రాక్ రాసినప్పుడే వాళ్ళిద్దరినీ దృష్టిలో పెట్టుకొని రాసుకున్నాను.


క్లైమాక్స్ ఛాలేజింగ్ గా ఫీలయ్యాను

సినిమా క్లైమాక్స్ లో విజయ్ వెళ్లి కాళ్ళ మీద పడే సీన్ ను ఛాలెంజింగ్ గా తీసుకున్నాను. విజయ్ చేస్తాడా లేదా అనుకున్నాను. చెప్పగానే చేసేసాడు. అర్జున్ రెడ్డి లాంటి ఇమేజ్ పెట్టుకొని విజయ్ అలా చేస్తే ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారా.. అనే డౌట్ ఉంది. ఫైనల్ గా ఆ సీన్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. థియేటర్స్ లో ఆ సీన్ కి బాగా ఎంజాయ్ చేస్తున్నారు.

 

ఒక్క నైట్ లోనే షూట్ చేశాం

ఈ సినిమాలో హీరో చెప్పే స్టోరీ వినడానికి ఒక అమ్మాయి కావాలనుకున్నాం. కానీ స్టార్ తో వెల్దామనుకోలేదు. అనుకోకుండా నిత్యా మీనన్ అయితే బాగుంటుందని అనిపించి వెంటనే తనని సంప్రదించాం. కథ వినగానే నిత్యా వెంటనే ఒకే చెప్పి ఆ రోల్ చేసింది. కేవలం ఒక రాత్రి లోనే ఆ సీన్స్ అన్నీ షూట్ చేశాం. రాతి 10 కి షూట్ స్టార్ట్ చేసి నెక్స్ట్ డే మార్నింగ్ 10 కల్లా ఫినిష్ చేసేశాం.

 

బెస్ట్ కాంప్లిమెంట్ అదే

సినిమా మార్నింగ్ షో చూస్తున్నాం. అల్లు అరవింద్ గారి నుండి మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్ లో బ్లాక్ బస్టర్ కొట్టేసావ్ కంగ్రాట్స్ అని ఉంది. అదే నాకు ఫస్ట్ అండ్ బెస్ట్ కాంప్లిమెంట్.

 

క్లారిటీ లేదు

నెక్స్ట్ సినిమా గురించి ఇంకేం ఆలోచించలేదు. ప్రస్తుతానికి ఈ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నాను. గీతా ఆర్ట్స్ లో ఒక సినిమా మైత్రి మూవీ మేకర్స్ మరో సినిమా కమిట్ అయ్యాను. అలాగే మంచు విష్ణు తో కూడా ఓ సినిమా చేయబోతున్నాను. ప్రస్తుతానికి ఇందులో నెక్స్ట్ సినిమా ఏంటనేది మాత్రం ఇంకా నో క్లారిటీ.