నిర్మాతగా మారనున్న మరో దర్శకుడు

Tuesday,June 11,2019 - 11:01 by Z_CLU

టాలీవుడ్ లో కొందరు దర్శకులు నిర్మాతగా మారి… కొత్త దర్శకులకు అవకాశం ఇస్తున్న సంగతి తెలిసిందే. రామ్ గోపాల్ వర్మ, సుకుమార్ , మారుతి లాంటి దర్శకులు ప్రస్తుతం నిర్మాతలుగా కొనసాగుతున్నారు. ఇప్పుడు ఈ లిస్టులో మరో డైరెక్టర్ చేరబోతున్నాడు. ‘పవర్’ సినిమాతో దర్శకుడిగా పరిచయమై నాలుగో సినిమా చేస్తున్న కే.ఎస్.రవీంద్ర (బాబీ) త్వరలో నిర్మాతగా మారి ఓ సినిమా నిర్మించబోతున్నాడు.

ప్రస్తుతం వెంకటేష్-నాగచైతన్యలతో ‘వెంకీమామ’ సినిమా తెరకెక్కిస్తున్న బాబీ ఈ సినిమా తర్వాత ప్రొడక్షన్ హౌజ్ స్థాపించి అరుణ్ పవర్ డైరెక్షన్ లో ఓ సినిమా ప్లాన్ చేస్తున్నాడు. ఈ విషయాన్ని దర్శకుడు అరుణ్ పవర్ స్వయంగా తెలియజేసాడు. సినిమాకు కథ కూడా రెడీ అయిందని తెలిపాడు. సో నిర్మాతగా బాబీ ఎలాంటి విజయం అందుకుంటాడో చూడాలి.