డిమాండ్ లో అక్కినేని టైటిల్స్

Tuesday,June 11,2019 - 12:02 by Z_CLU

వరసగా అక్కినేని టైటిల్స్ కి డిమాండ్ పెరిగిపోతుంది. రీసెంట్ గా రిలీజైన విజయ్ ఆంటోని సినిమా ‘కిల్లర్’ కూడా నాగార్జున సినిమా టైటిలే. అంతెందుకు ఇలా చెప్పుకుంతూ పోతే గీతాంజలి, శ్రీమంతుడు, చినబాబు, దేవదాస్, మజ్ను, సువర్ణసుందరి.. ఈ సినిమాలన్నీ అక్కినేని సక్సస్ ఫుల్ సినిమాల లిస్టు లోనివే…

సూపర్ హిట్ సినిమా టైటిల్ మళ్ళీ పెట్టుకుంటే ఆ సినిమా సక్సెస్ అని గ్యారంటీ లేదు కానీ, కొద్దో గొప్పో పాజిటివ్ బజ్ క్రియేట్ అయ్యే చాన్సెస్ అయితే ఉంటాయి. అందుకే ఫిలిం మేకర్స్ పర్టికులర్ గా ఒక టైటిల్ గనక ఫిక్స్ అయి ఉండకపోతే అక్కినేని సినిమా డైరీలో ఒక లుక్కేస్తున్నారు…  ఈ లెక్కన మరిన్ని అక్కినేని వారి సినిమా  టైటిల్స్ మళ్ళీ కొత్త స్టైల్ లో కనిపించే చాన్స్ ఉంది.

 కొంచెం ధైర్యం చేయాలికానీ నాగార్జున సినిమాల లిస్టులో ‘శివ’ క్రేజీ టైటిల్. కాకపోతే సినిమా అనౌన్స్ అయినప్పుడే ఎక్స్ పెక్టేషన్స్ పెరిగిపోతాయి. అందుకే ఫిలిం మేకర్స్ అంత ఈజీగా ధైర్యంచేయరు. ఇకపోతే ఈ వరసలో నిర్ణయం, హలోబ్రదర్, క్రిమినల్, నిన్నే పెళ్ళాడతా, సూపర్, సంతోషం, సినిమాలన్నీ ఆడియెన్స్ మైండ్ లో ఫరెవర్ ఇంపాక్ట్ క్రియేట్ చేసినవే.

ANR ఫిల్మోగ్రఫీ లో కూడా క్రేజీ టైటిల్స్ ఉన్నాయి… కొన్ని ఇప్పటికే రిపీటవుతున్నా ఇంకొన్ని ఈ జెనెరేషన్ సినిమా ఫార్మాట్ కి అంతే సూటబుల్ అనిపిస్తున్నాయి. లైలా మజ్ను, ఆరాధన, దసరా బుల్లోడు, ప్రేమనగర్ ఇలా చెప్పుకుంటూ పోతే, కథ కొద్దిగా టైటిల్ కు దగ్గరలో అనిపించినా చాలు, ఫిల్మ్ మేకర్స్ ANR లిస్టులోంచి ఈజీగా పిక్ చేసుకుంటున్నారు.